Tuesday, 3 November 2026

రాజ్యాంగ నిర్మాత, బహుజన సూర్యుడు అంబేద్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) :
భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన సూర్యుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు దేశ వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు. ఆ యన 124వ జయంత్యుత్సవాలను ఘ నంగా నిర్వహించారు. పార్లమెంట్‌ ఆవర ణలోని అంబేద్కర్‌ విహ్రానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ తదితరులు ఘన నివాళుర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్‌ మనకు ఆదర్శ ణీయమని అన్నారు. ఆయన చూపిన మా ర్గం అందరికీ అనుసరణీయమని అన్నా రు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలుల వేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీపీఎం నేత రాఘవులు తదితరులు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *