![soniya]](http://JanamSakshi.org/imgs/2014/04/soniya5.jpg)
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర
గుజరాత్‌ది అభివృద్ధే కాదు : సోనియా
మొరాదాబాద్, ఏప్రిల్ 14 (జనంసాక్షి) :
అతివాద భావజాలమున్న ఆర్ ఎస్‌ఎస్‌ఎప్పినట్లు బీజేపీ ఆడు తోందని ఏఐసీసీ అధ్యఓఉరాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిది విభజించే సిద్ధాంతమని ఆరోపించారు. ప్ర స్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు పూర్తి భిన్నమైన సిద్ధాంతాల మధ్య పోరాటమని అభివర్ణించా రు. ఉత్తరప్రదేశ్‌లోని మోరాదా బాద్‌లో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఇక్కడ జరి గిన బహిరంగసభలో ఆమె మా ట్లాడుతూ ముస్లింలను ఆకట్టుకు నే ప్రయత్నం చేశారు. మైనార్టీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ, జాతీయ వక్ఫ్ అభివృద్ధి కార్పొ రషన్
లాంటి చారిత్రక నిర్ణయాలతో ముస్లిం మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్ మొదలైన వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తుంటే మరోవైపు అతివాద బావజాలం ఉన్న సంస్థ చెప్పినట్లు బీజేపీ పనిచేస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా విలువలు, సిద్ధాంతాలను తాము భద్రంగా చూసుకుంటే బీజేపీ వాటిని ధ్వంసం చేస్తోందనిమండిపడ్డారు. దేశానికి కావలసిన స్థిరమైన, సమర్థవంతమైన పాలన అందించే సత్తా కాంగ్రెస్‌పార్టీకే ఉందని చెప్పారు.
ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో భాజపా కీలుబొమ్మ




