
ఆ తర్వాతే నిర్ణయం వెల్లడిస్తాం
18న మరోసారి జాక్ భేటీ : కోదండరామ్
పార్టీలకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఇతర సంఘాలను జేఏసీలో చేర్చుకునే అంశంపై చర్చించారు. అయితే ఈనెల 18న మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ అన్నారు. జేఏసీలో చేరాలనుకుంటున్న ఇతర సంఘాలను త్వరలో మాతో కలుపుకుంటామని కోదండరాం పేర్కొన్నారు. జేఏసీ కో ఛైర్మన్‌గా విఠల్, కన్వీనర్‌గా దేవీప్రసాద్, అధికార ప్రతినిధులుగా రఘు, హవిూద్ మహ్మద్‌ఖాన్, కో కన్వీనర్లుగా వెంకటేశం, ప్రహ్లాద్, జ్ఞానేశ్వర్, వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. ఇదిలావుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించు కోవాలని జేఏసీ నేత మల్లెపల్లి లక్ష్మయ్య కోరారు. ఈనెల 16న ఖమ్మంలో ఆదివాసీ సంఘాలతో పోలవరం అంశంపై తాము సమావేశం కానున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల తమకు ఏర్పడుతున్న సమస్యలను తెలిపేందుకు తాము త్వరలో గవర్నర్ నరసింహన్‌ను, కమలనాథన్ కమిటీని కలువనున్నట్టు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. విభజనలో ఉన్న లొసుగులను గవర్నర్‌కు వివరిస్తామని ఉద్యోగ సంఘాల నేత విఠల్ తెలిపారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలని మరో నేత దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగుల విభజనపై రాజకీయ పార్టీలు తమ వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్టీల మేనిఫెస్టోలపై చర్చిస్తాం




