Tuesday, 3 November 2026

అది ప్రకృతి ధర్మం

హిజ్రాలను థర్డ్‌ జెండర్‌గా గుర్తించండి
విద్యా, ఉపాధి రంగాల్లో సమాన హక్కులు, రిజర్వేషన్లు
సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) :
సమాజంలో హిజ్రాలను థర్డ్‌ జండర్‌గా గుర్తించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సు ప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించింది. హిజ్రాలకు ప్ర త్యేక హక్కులు కల్పించాలని సు ప్రీం కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు ఆదేశాలు జారీ చేసిం ది. లింగమార్పిడి చేయించుకు న్న వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని, విద్య, ఉపాధిలో సమాన హక్కులు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలన్న పిటిషన్‌పై మంగళవారం ఉదయం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పును ప్రకటించింది. హిజ్రాలపట్ల వివక్షపై సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. హిజ్రాలను థర్డ్‌ జెండర్‌గా గుర్తించడం వల్ల వారికి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశాలు లభ్యమవుతాయని కోర్టు అభిప్రాయపడింది. హిజ్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. లింగమార్పిడి చేయించుకున్న వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని, విద్య, ఉపాధిలో సమాన హక్కులు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఇప్పటి వరకు రెండు జెండర్‌(ఆడ, మగ)లే అమలులో ఉండగా, తొలిసారి మూడవ జెండర్‌ను సుప్రీం కోర్టు గుర్తించింది. మూడవ జెండర్‌కు వారు ఇతర వెనకబడిన తరగతుల కిందకు వస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోర్టు ప్రభుత్వాలను ఆదేశించింది. లింగమార్పిడి చేయించుకున్న వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని కోర్టు కూడా సూచించింది. స్వలింగ సంపర్కులు, నపుంసకులు, తృతీయ ప్రకృతికి చెందిన వారిని మిగతా పౌరుల్లాగానే చూడాలని, మిగతావారికి ఉన్న సామాజిక ఆమోదం, సమానావకాశాల వంటి అన్ని హక్కులు వారికి కూడా ఉండాలని తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు కె ఎస్‌ రాధాకృష్ణన్‌, ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. తృతీయప్రకృతి పట్ల వివక్షను అంతమొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. తృతీయ ప్రకృతిని సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తించాలని కూడ న్యాయస్థానం ఆదేశించింది. డ్రైవింగ్‌ లైసెన్సులు, రేషన్‌ కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్‌ పోర్టుల దరఖాస్తు ఫారాల్లో స్త్రీ, పురుషతో పాటు తృతీయ ప్రకృతి అనే క్యాటగరీని జోడించాలని, వారికి విద్యా సంస్థల్లో, ఆసుపత్రుల్లో ప్రవేశాన్ని కల్పించాలని, వారికి టాయిలెట్ల ఏర్పాటు చేయించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. లక్ష్మీ త్రిపాఠీ అనే తృతీయ ప్రకృతికి చెందిన వ్యక్తి వేసిన పిటిషన్‌ పై సుప్రీం కోర్టు ఈ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. లక్ష్మీ త్రిపాఠీ ఈ తీర్పును చరిత్ర గతిని మార్చేసే తీర్పుగా అభివర్ణించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *