ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా నా బంగారు తల్లి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (జనంసాక్షి) :జాతీయ చలన చిత్ర అవా ర్డులను ప్రకటించారు. 2013 సంవత్సరానికి జాతీయ ఉత్తమ చిత్రం గా ఆనంద్‌గాంధీ దర్శకత్వంలో నిర్మించిన ‘షిఫ్ ఆఫ్ థిసీస్’ ఎంపిక యింది. షహీద్ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. ఉత్తమ నటులుగా షహిద్‌లో నటించిన రాజ్‌కుమార్, పెరారియాతవర్
చిత్రంలో నటించిన సూరజ్ వెంజారుమూడు ఎంపికయ్యారు.ఉత్తమ ప్రాంతీయ తెలుగుచిత్రంగా రాజేష్ టచ్రీవర్ దర్శకత్వంలో రూపొందించిన ‘నా బంగారు తల్లి’ ఎంపికయింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నేపథ్య సంగీత అవార్డు కూడా దక్కింది. సినిమాకు శాంతారాం మొయిత్రా సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నటించిన అంజలిపాటిల్‌కు ప్రత్యేక ప్రశంస సినీ రంగంపై ప్రముఖ విలేకరి నందగోపాల్ రచించిన ‘సినిమాగా సినిమా’ పుస్తకానికి ఉత్తమ రచన విభాగం కింద జాతీయ అవార్డు లభించింది. 20వశాతాబ్దం నుంచి సినిమా రంగంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం, భవిష్యత్తులో సినిమా రంగంలో చోటుచేసుకునే మార్పులను రచయిత ఇందులో వివరించారు. కేవలం భారతీయ చిత్ర పరిశ్రమ గురించే కాక, ప్రపంచ చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల గురించి రచయిత చక్కని వివరణలు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే…ఉత్తమ చిత్రం- షిప్ ఆఫ్ థిసీస్, ఉత్తమ దర్శకుడు- హన్సల్ మెహతా (షహీద్), ఉత్తమ నటుడు- రాజ్‌కుమార్ (షహీద్), సూరజ్ వెంజారముడు (పెరారియాతవర్), ఉత్తమ నటి – గీతాంజలి థాపా (లయర్స్‌డైస్), ఉత్తమ సహాయనటుడు – సౌరభ్‌శుక్లా (జాలీ ఎల్‌ఎల్‌బీ), ఉత్తమ సహాయనటి – అమృతసుభాశ్ (అస్తు), ఐదాఎల్ కైసెఫ్ షిప్ ఆఫ్ థిసీస్), ఉత్తమ సంగీత దర్శకుడు – అనురాగ్ సైకియా,ఉత్తమ నేపథ్యగాయకుడు – రూపాంకర్ (జతీశ్వర్) ఉత్తమ నేపధ్యగాయని – బేలా షెండె (తుహ దర్మ కోంచ), ఉత్తమ ఛాయాగ్రహకుడు- రాజీవ్ రవి (లయర్స్‌డైస్), ఉత్తమ ఎడిటింగ్ – సాబుజోసెఫ్ (వల్లినం), స్పెషల్ జ్యూరీ అవార్డు – యల్లో (మరాఠీ), మిస్‌లవ్లీ (హిందీ), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – జాల్ (హిందీ సినిమా), ఉత్తమ కొరియోగ్రఫీ – గణెళిశ్ ఆచార్య( బాగ్ మిల్కాబాగ్), ఉత్తమ వినోదాత్మక చిత్రం – బాగ్ మిల్కా బాగ్, ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం – తలైమురైగల్ (బాలు మహేంద్ర దర్శకత్వం), ఉత్తమ బాలల చిత్రం – కపాల్ (హిందీ) ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం – నా బంగారుతల్లి ఎంపికయ్యాయి.




