కేంద్ర మంత్రి కపిల్ సిబల్
నూఢిల్లీ, ఏప్రిల్ 16 (జనంసాక్షి) :
బీజేపీ సాగిస్తున్న హైటెక్ ప్రచారానికి డబ్బులెక్కడివని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నించారు. నల్లధనాన్ని వెన క్కి రప్పిస్తామంటే గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు తమ త్రీడీ ప్రచారానికి ఉపయోగిస్తున్నది బ్లాక్‌మనీ కాదా అని సూటిగా ప్రశ్నించారు. బుధవారం
ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లధనం, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్‌మనీపై బీజేపీ నేతలు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. గోద్రా తదనంతర మారణహోమంపై ఆయన క్షమాపణ చెప్పననడాన్ని తప్పుబట్టారు. మోడీ తన దురంహకారాన్ని వీడటం లేదని, ఆయన తీరుతో దేశ ప్రజల తమ భద్రతపై సందేహాలు పెంచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీతివంతమైన పాలనపై మోడీ మాటలు చెప్పడం కాదని, తమ ప్రచార ఆర్బాటానికి సంబంధించిన లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మీ హైటెక్ ప్రచారానికి డబ్బులెక్కడివి




