
అస్త్ర సన్యాసం ప్రకటించిన సమైక్యాంధ్ర చీఫ్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (జనంసాక్షి) :
జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల బరి నుంచి పరారయ్యాడు. ఎన్నికలకు ముందే ఓటమిని పస ిగట్టిన కిరణ్ అస్త్ర సన్యాసం ప్రకటించారు. తన తమ్ముడితో సొంత నియోజకవర్గం పీలేరులో నామినేషన్ వేయించారు. శనివారం నామినేష న్ల కు చివరి రోజు కావడంతో ఆయన నామినేషన్ వేస్తారని ప్రచారం సాగింది. చివరికి కిరణ్ సోద రుడు కిషోర్ కుమార్‌రెడ్డి జైసమైక్యాంధ్ర తరపున పీలేరు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పీలేరు నుంచి ఆయన తన సోదరుడిని పోటీకి దించారు. కిరణ్ సోదరుడు కిషోర్‌కు మార్ రెడ్డి శనివారం
నామినేషన్ దాఖలు చేశారు. కాగా తాను పోటీలో ఉంటే పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం కష్టమవుతోందని కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడిగా కిరణ్ ప్రజలను ఆకర్షించలేకపోతున్నారని ఆ పార్టీ నేతలు వాదులాడుకుంటున్నారు. అదేవిధంగా ఆశించినంతగా నేతలు పార్టీలో చేరకపోవడం కూడా ప్రజలు కిరణ్ పార్టీని ఆదరించడం లేదని తెలుస్తోంది. నిన్నటిదాకా కిరణ్ గురించి గొప్పగా చెప్పిన ఎంపీలు హర్షకుమార్, సబ్బంహరి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు కూడా ఆయన పేరు ఎత్తడానికి సాహసం చేయలేదు. పార్టీ అధ్యక్షుడే పోటీకి దూరంగా ఉంటే ఇక ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావటం లేదు.
ఎన్నికల బరి నుంచి కిరణ్ పరార్




