
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 (జనంసాక్షి) :
కాశ్మీర్ సమస్యపై చర్చించేందుకు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ తన వద్దకు దూతను పంపాడని హురి య త్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీషా గిలానీ ప్రకటించారు. ఈమేరకు ఆయన ప్రక టనతో కూడిన కథనాన్ని జాతీయ మీడి యా ప్రముఖంగా ప్రస్తావించింది. అ యితే గిలానీని మోడీ కలిసేందుకు ప్రయత్నించినట్టుగా వచ్చిన కథనాలు నిరాధారమైనవి భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఈ కథనాలను ఖండించారు. కాశ్మీర్ వేర్పాటువాద నేత గిలానీని కలవాల్సిన అవసరం మోడీకి లేదని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, దీనికి బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. మోడీ తనకు వద్దకు ప్రతినిధులను పంపారని, ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తే కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామని గిలానీ పేర్కొనడాన్ని రవిశంకర్ తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గిలానీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే మోడీ, గిలానీతో భేటీకి ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీశాంయమైంది.
మోదీ నా వద్దకు దూతను పంపాడు : గిలానీ




