
నాగావ్, ఏప్రిల్ 19 (జనంసాక్షి) :
మత ప్రాతిపదికన దేశ ప్రజలను విభజించే రాజ కీయాలు మీవంటూ భా రతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షు డు రాహుల్‌గాంధీ మం డిపడ్డారు. అసోంలోని నాగావ్ పార్లమెంట్ ని యోజకవర్గంలో శనివా రం రాహుల్‌గాంధీ ఎన్ని కల ప్రచారాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా బీజేపీపై, ఆ పార్టీ ప్రధా నమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆరోపణలు గు ప్పించారు. బీజేపీది బ్రిటి ష్ వారి లాగానే ప్రజల ను విభజించు, పాలించు పద్ధతిలో ఉందంటూ పే ర్కొన్నారు. గుజరాత్ అభి వృద్ధి అంటే ధనికులు మాత్రమే మరింత ధనవంతులయ్యారని తెలిపారు. పేదలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డారని తెలిపారు. రైతుల వద్ద నుంచి బలవంతంగా లాక్కున్న భూములను గుజరాత్
ప్రభుత్వం కారు చౌకగా పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్లకు కట్టబెట్టిందని తెలిపారు. కేంద్రంలోనూ, అసోంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండటం వల్ల అసోంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. కాంగ్రెసేతర రాష్ట్రాలకు సమాన స్థాయిలో నిధులు ఇచ్చినా అవి వాటిని సరియైన మార్గంలో వినియోగించకపోవడంతో అక్కడి పేదలకు అన్యాయం జరిగిందని అన్నారు. కాంగ్రెస్‌కు తిరిగి అధికారమిస్తే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు. మహిళలకు బ్యాంకు రుణాలు, పోలీస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సగం పదవులు, ముఖ్యమంత్రి సహా మహిళలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజల మధ్య స్నేహబంధాన్ని కోరుతుంటే బీజేపీ మాత్రం విద్వేషాలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసోంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని తరుణ్‌గగోయ్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తోందని చెప్పారు.
మత ప్రాతిపదికపై విభజించే రాజకీయాలు మీవి : రాహుల్




