
అమేథి, ఏప్రిల్ 19 (జనంసాక్షి) :
భాజపా పాలిత ప్రాంతాలన్నీ అవినీతిమయమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియగాంధీ అన్నారు. కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న పార్టీలే అవినీతికూపంలో పీకల్లోతు కూరుకుపోయాయని, అలాంటి పార్టీలు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తరపున సోనియాగాంధీ శనివారం అమేథిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీల కర్మభూమి కోసం రాహుల్ చిత్తశుద్ధితో అహర్నిశలు కష్టించి పనిచేస్తున్నారని తెలిపారు. అందుకే అమేథి ప్రజలు రాహుల్, ప్రియాంకలపై ప్రేమ, వాత్సల్యం చూపుతున్నారని అన్నారు. రాజీవ్‌గాంధీని ప్రజల సేవకు అప్పటించిన మాదిరిగానే తాను రాహుల్‌గాంధీని 2004లో అమేథి ప్రజలకు అందించానని ఆమె ఉద్వేగపూరితంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆమె అమేథిలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు ఓటర్లను ముఖాముఖి కలిసిన సోనియాగాంధీ, రాహుల్‌కు మద్దతివ్వాలని కోరారు.
భాజపా పాలిత ప్రాంతాలంతా అవినీతే : సోనియా




