Tuesday, 3 November 2026

పెట్టుబడిదారుల ఆస్తులకే మోడీ వాచ్‌మన్‌ : రాహుల్‌


కరౌలీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ఆస్తులకే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వాచ్‌మన్‌, ఆయనకు ప్రజల రక్షణ ఎం తమాత్రం పట్టదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశా రు. ఆదివారం రజస్థాన్‌లోని కరౌలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అద్వానీ, జస్వం త్‌సింగ్‌లాంటి సీనియర్‌ నేతలను పూచిక పుల్లలా పక్కనబెట్టిన మోడీ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ప్రజాజీవితంలో కొనసాగి ఉంటే ఆయన్ను ఇలాగే పక్కకు తప్పించేవాడని మండిపడ్డారు. దేశానికి వాచ్‌మన్‌గా ఉంటాన న్న మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదమైనవిగా ఆయన కొట్టిపారేశారు. ఆయన దేశానికి కాకుండా బడా వ్యాపారులకు మాత్రమే వాచ్‌మన్‌గా ఉంటారని పేర్కొన్నారు. గుజరాత్‌ అభివృద్ధి ఒక్క మోడీ వల్లే సాధ్యపడలేదని, అక్కడి రైతులు, కార్మికుల శ్రమ ఫలితంగానే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నా రు. బీజేపీ దేశంలో ద్వేషపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తోందని, మత ప్రాతి పదికన దేశాన్ని నిట్టనిలువునా చీల్చాలని కుట్రలు పన్నుతోందని ఆరోపిం చారు. ప్రజలు ఇలాంటి ద్వేష రాజకీయాలను ప్రోత్సహించవద్దని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో జీవించే ప్రజలంతా సమానమేనని,
వారిని ఒక్కతాటిపై నిలిపేందుకు తమ పార్టీ కృషి చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో అజ్మీర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సచిన్‌ పైలెట్‌, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *