Tuesday, 3 November 2026

హత్య చేసి మోడీ ఇంటి నుంచి పారిపోయిండు


కేంద్ర మంత్రి బేణీప్రసాద్‌ వర్మ
లక్నో, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :గుజరాత్‌ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధా ని అభ్యర్థి నరేంద్రమోడీ 18 ఏళ్ల వయసులోనే హత్య చేశాడని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీప్రసాద్‌ వర్మ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మోడీ యుక్తవయసులోనే హత్య చేసి ఇంటి నుంచి పారిపోయాడని ఆయన ఆరో పించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించిన సమావేశంలో బేణీప్రసా ద్‌ వర్మ మాట్లాడుతూ, గుజరాత్‌లోని పోలీస్‌స్టేషన్లలో మోడీపై పలు క్రిమి నల్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. చిన్నతనంలో హత్యలు చేసిన మో డీ రాజకీయాల్లో చేరి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సొంత ప్రజలనే ఊచకోత కోయించాడని తెలిపారు. ప్రజలను ఎప్పుడూ సమాన దృష్టితో చూసిన చరిత్రమోడీకి లేదన్నారు. అయితే వర్మ
ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని బేణీ వ్యాఖ్యలతో అది మరోసారి నిరూపితమైందని అన్నారు. పలు ఎన్నికల్లో బేణీ అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. బీణీ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *