Tuesday, 3 November 2026

ముస్లింలకు రిజర్వేషన్‌ ఇస్తా.. మోడీని అడ్డుకుంటా


సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం
ఫిరోజాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడతానని, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పీఠం ఎక్క కుండా అడ్డుకుంటానని సమజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ అ న్నారు. ఆదివారం ఫిరోజాబాద్‌, హథ్రాన్‌, ఎటావాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచా ర సభల్లో ములాయం పాల్గొని మాట్లాడారు. తమకు అధికారం ఇస్తే రాజ్యాంగ సవరణ చేసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నరేంద్రమోడీ ప్రధానికాకుండా అడ్డుకోగల శక్తి ఒక్క సమాజ్‌వాదీ పార్టీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. మోడీ చెప్తోన్న గుజరాత్‌ అభివృద్ధి నమూనా అంతా
వట్టిదేనని, గుజరాత్‌ అభివృద్ధి అంతా బూటకమని అన్నారు. బీజేపీలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ 272 స్థానాలు సాధించడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలపై తమ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిరాధరమైనవిగా ఆయన కొట్టిపడేశారు. ఆ పార్టీకి చెందిన నాయకులే అక్కడి సమాచారం అంతా తమకు చేరవేస్తున్నారని ఆయన తెలిపారు. సమాజ్‌వాదీ అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని, కేంద్రంలో తృతీయ కూటమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *