Tuesday, 3 November 2026

ముస్లింలకే ఉప ముఖ్యమంత్రి


టీఆర్‌ఎస్‌దే అధికారం
తెలంగాణ ప్రజలు నిర్ణయం
తీసుకున్నారు : కేసీఆర్‌
కరీంనగర్‌, ఏప్రిల్‌ 21 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ముస్లింలకే ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కే అధికారం ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. సోమ వారం కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లోని తొమ్మిది అసెంబ్లీ నియోజ కవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించి ప్రచారం చేశారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖాయమని టీఆర ్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. టీడీపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని అన్నారు. మంథని అసెంబ్లీ నియో జకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఇక్కడ ఏర్పా టు చేసిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల సభలో అన్నారు. మంథనిలో టీఆర్‌ఎస్‌ పక్కాగా గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఇప్పటికే పుట్ట మధు విజయంసాధిస్తాడని సర్వేలు చెప్పాయని, ఇంట లిజెన్స్‌ నివేదికలు కూడా అందాయని వెల్లడించారు. ఆయనను గెలిపిస్తే ఇక్కడ అభివృద్ది పనులన్నీ తాను నిలబడి చేయిస్తానని అన్నారు. ఈ పనులకు ఎవరు అడ్డొస్తారో చూస్తానన్నారు. ఇక్కడ మంత్రిగా ఉండగా శ్రీధర్‌బాబు ఆగడాలు మితిమీరి పో యాయన్నారు. ఆయన ఇప్పుడు ఓ సామాన్యకాంగ్రెస్‌ కార్య కర్తన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. మంథని నియోజకవర్గంలో ఆదివాసీలు ఉన్నారని వాళ్ల ఓట్లు టీఆ ర్‌ఎస ్‌కే పడతాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌
ప్రభుత్వం రాగానే గిరిజన తండాలను పంచాయతీలుగా చేస్తామని హావిూ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలంతా మంత్రులుగా ఉన్నా కనీసం బ్రిడ్జిలు కూడా కట్టించలేక పోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే నియోజకవర్గం సమస్యలన్నింటినీ తీర్చుతామని వెల్లడించారు. స్థానిక నేత శ్రీధర్‌బాబు వల్ల మంథని ప్రజలు విసిగిపోయి ఉన్నారని, వచ్చిన తెలంగాణను తెలంగాణ కాంగ్రెస్‌ నేతల చేతుల్లో పెట్టడం వారికి ఇష్టంలేదని పేర్కొన్నారు. అసలు శ్రీధర్‌బాబు నియోజకవర్గానికి ఏంచేశాడని కేసీఆర్‌ నిలదీశారు. నియోజకవర్గంలో ఇప్పటికీ 90 శాతం గ్రామాలకు తాగునీరు లేదని విమర్శించారు. శ్రీధర్‌బాబు మంత్రిగా తెలంగాణ ఉద్యమకారులను కొట్టించడానికే సరిపోయాడని అన్నారు. కొత్త నాయకత్వాన్ని సహించలేని గరీబోడు శ్రీధర్‌బాబు అని దుయ్యబట్టారు. పోలీసులు ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. ఆయనకు రక్షణ కల్పించండి కానీ అతి చేయొద్దని అన్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సీమాంధ్ర తొత్తుల వ్యవహరిస్తున్నాడని టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. శ్రీధర్‌బాబు తనను అడుగడుగునా అడ్డుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డితో కలిసి తనను అంతమొందించేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. ఒక నియంతలా శ్రీధర్‌బాబు వ్యవహరించాడని దుయ్యబట్టారు. ప్రజాసేవ చేస్తుంటే తనపై రౌడీషీట్‌ కేసులు అక్రమంగా పెట్టించాడని వివరించారు. ప్రజాసేవ చేయడమే రౌడీయిజం అయితే తాను రౌడీనేనని మధు ఆవేశంగా అన్నారు. నియోజకవర్గంలో తనను ఎవరి వద్దకు వెళ్లనిచ్చేవాడు కాదని, ఎవరైనా వస్తే రానిచ్చేవాడు కాదని పేర్కొన్నారు. ఈ సాధారణ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉందని టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆషౄమాషీ ఎన్నికలుకావని, అందువల్ల అందరూ ఆలోచించి ఓటేసి టిఆర్‌ఎస్‌ అబ్యర్తలను గెలిపించాలని పిలుపునిచ్చారు. సోమవారం తిమ్మాపూర్‌లో జరిగిన మానకొండూరు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న తొలి ఎన్నికలని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే సీమాంధ్రుల పాలన నుంచి బయటపడ్డామని తెలిపారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఓటర్లను హెచ్చరించారు. ఆనాడు చేసిన తప్పు ఫలితంగా 60 ఏళ్లు అనుభవించామని ఇవాళ మళ్లీ తప్పు చేయకూడదని వివరించారు. ఆనాడు విలీనమైన కారణంగా మళ్లీ బయటకు రావడానికి అనేక ప్రాణాలు త్యాగాలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివద్ధికి పాల్పడే వారికే అధికారం అప్పగించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలి, ఎవరి చేతిలో అధికారం ఉంటే మంచి జరుగుతది, సాగునీరు, తాగునీరు ఎవరు తీసుకొస్తారో ఆలోచించాలని సూచించారు. ఆంధ్రోళ్లతో ఇంకా పంచాయతీ అయిపోలేదని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో పోరాడాల్సి ఉందన్నారు. అందుకే పోరాటం చేసే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను ఉత్త పుణ్యానికి ఎవరూ ఇవ్వలేదనిఅనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నామని కెసిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇవాళ వచ్చి తామే తెలంగాణ ఇచ్చామని, తెచ్చామని అంటున్నారని విమర్శించారు. అసలు తెలంగాణ నేతలు ఒక్కరోజైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అని నిలదీశారు. ఏనాడైనా జైలుకెళ్లారా, ఉద్యమ జెండా పట్టారా అని ప్రశ్నించారు. మానకొండూరులో అనేక సమస్యలున్నాయని ఆ సమస్యలన్నీ తీరాలంటే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు, ఎంపీగా వినోద్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తెలంగాణ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. మానకొండూరు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ నేత నారదాసు లక్ష్మణ్‌రావు విజ్ఞప్తి చేశారు. రసమయిని కరీంనగర్‌ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా ఆదరించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రసమయిని గెలిపించాలని నియోజకవర్గం మహిళా లోకం కంకణం కట్టుకుందని పేర్కొన్నారు. కాగా, ఈ సభలో పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు మెదక్‌ జిల్లా దుబ్బాక సభలో కెసిఆర్‌ మాట్లాడారు. దుబ్బాకతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కెసిఆర్‌ అన్నారు. తన విద్యాబ్యాసం సాగిందంతా ఇక్కడేనని గుర్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌పార్టీ ఎన్నికల సభలో ప్రసంగించేందుకు ఆయన దుబ్బాక వచ్చారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దుబ్బాక నియోజకవర్గంలో సాగునీరుకు, తాగునీరుకు సమస్యలేకుండా చేస్తానని హావిూ ఇచ్చారు. సిద్దిపేట తరహాలో తాగునీటి పథకాన్ని రూపొందిస్తామన్నారు. దుబ్బాకలో నీటి పథకాల నిర్వహణను తన చిన్ననాటి నుంచి చూస్తున్నానని ఇప్పటికి తీరలేదని అన్నారు. ఇక్కడో కొయ్య అక్కడో కోయ్య పాతి ఇదే నీటీ పథకం అన్నారని ఇప్పటికీ ఒక ప్రాజెక్టు రాలేదని విమర్శించారు. సీమాంధ్రుల పాలనలో మనకు మిగిలినవి కన్నీళ్లే కానీ నీళ్లు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో తడకపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించి నియోజకవర్గం తాగునీటి, సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే నియోజకవర్గంలోని లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు అందజేయవచ్చని వివరించారు. తాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. టిడిపి, కాంగ్రెస్‌ మాటలు నమ్మి ఆగం కావద్దన్నారు. రామలింగారెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *