Tuesday, 3 November 2026

‘కమల్‌నాథన్‌’ సిఫార్సుల మేరకే ఉద్యోగుల బదలాయింపు


కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) :
కమల్‌నాథన్‌ కమిటీ సిఫార్సుల మేర కే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కు ఉద్యోగులను బదలాయిస్తామని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ తెలి పారు. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులో ఎలాంటి గందరగో ళం లేదని,
రాజకీయం కోసమే కేసీఆర్‌ గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అపాయింటెడ్‌ డేట్‌ కన్నా ముందే ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు జరుగుతుందన్నారు. తుది కేటాయింపు అపాయింటెడ్‌ డేట్‌ తర్వాతనేనని ఆయన చెప్పారు. తెలంగాణలో రాజకీయ సుస్థిరత అవసరమని, కాంగ్రెసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. ఇక్కడ తిరిగి కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. తాము కేసీఆర్‌ విమర్శలను పట్టించకోబోమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *