Monday, 2 November 2026

షిండేతో గవర్నర్‌ భేటీ

రాష్ట్రపతి పాలన పొడిగింపుపై చర్చ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) :
కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమా ర్‌ షిండేతో రాష్ట్ర గవ ర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నర సింహన్‌ భేటీ అయ్యా రు. గురువారం ఢిల్లీ కి చేరుకున్న నరసిం హన్‌
కేంద్ర హోం మంత్రిని కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ప్రెసిడెంట్‌ రూల్‌ పొడిగింపుపై ఆయనతో చర్చించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితినీ వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రెండు నెలల్లోగా పార్లమెంట్‌ ఆమోదం పొందాలి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీలంతా ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభను సమావేశ పరచడం సాధ్యం కాదు. రెండు నెలల్లోగా సభ ఆమోదం పొందకుంటే రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలి. ఈ నేపథ్యంలో గవర్నర్‌, షిండేతో భేటీ అయ్యారు. 30వ తేదీన రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు ప్రకటించి, మరోసారి రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు కేంద్ర మంత్రిమండలి ప్రకటించే అవకాశముంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే అపాయింటెడ్‌ డే జూన్‌ 2 తేదీన ఉండగా, ఇరు రాష్ట్రాల్లోనూ సార్వత్రిక ఎన్నికలు మే 7తో ముగియనున్నాయి. ఫలితాలు మే 16న ప్రకటిస్తారు. ఇరు రాష్ట్రాల్లో ఉనికిలోకి వచ్చే జూన్‌ 2నే రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరే అవకాశముంది. అప్పటి వరకు రాష్ట్రపతి పాలన పొడిగిస్తూ ఈనెల ఆఖరున మళ్లీ ప్రకటన వచ్చే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *