Monday, 2 November 2026

భిన్న సంస్కృతికి సంఘ్‌ పరివార్‌ విఘాతం


గుజరాత్‌ అభివృద్ధి వట్టిదే : సోనియా
గాంధీనగర్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) :
భిన్న సంస్కృతికి, మతాలకు, జాతులకు నిలయమైన భారత్‌లో సంఘ్‌ పరివార్‌ చిచ్చుపెడుతోందని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోని యాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీ కైన భారతదేశంలో ఒక మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా అల్పసం ఖ్యాలకుపై తన ప్రతాపాన్ని ప్రదర్శించేందుకు సంఘ్‌ పరివార్‌ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆమె తెలిపారు. గురువారం గుజరా త్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సోనియాగాంధీ పాల్గొ న్నారు. దేశంలో హిందుత్వ అతివాదాన్ని ప్రేరేపించడం ద్వారా మై నార్టీల కనీస హక్కులను కాలరాసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌ శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆమె తెలిపారు. విభిన్న జాతులు, మతాలకు నిలయైన భారత్‌ ప్రపంచంలోనే అన్ని దేశా లకు ఆదర్శ ప్రాయమైనదని, అలాంటి భారత్‌ చరిత్రను ధ్వంసం చేసేందుకు మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆమె పేర్కొ న్నారు. ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చుపెట్టే వారిపట్ల అప్రమ త్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పేదల భూములను కార్పొరేట్‌ గద్దలకు దోచిపెట్టడమేనా గుజరాత్‌ అభివృద్ధి అంటూ ఆమె నిల దీశారు. దేశంలో లౌకికవాద పరిరక్షణకు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే అండగా నిలవాలని అన్నారు. ప్రజల స్వేచ్ఛ, సమానత్వపు హక్కు లు దోచుకునే శక్తులను అధికారంలోకి
రానివ్వొద్దంటూ హితవు పలికారు. గుజరాత్‌ అభివృద్ధి కేవలం కార్పొరేట్ల అభివృద్ధి మాత్రమేనని, ఇక్కడి ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోకుండా అల్లాడుతున్నారని ఆమె అన్నారు. మోడీ ప్రజలను భయకంపితులను చేసి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నాడని, ఆయనకు కార్పొరేట్‌ మీడియా వంతపాడుతోందని ఆమె మండిపడ్డారు. ప్రజలను సమ దృష్టితో చూడలేని వాళ్లు ప్రజాజీవితంలో ఉండటానికి అర్హులు కాదంటూ ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతోనే సుస్థిర పాలన సాధ్యమని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *