
గుజరాత్‌లో రైతుల భూములు లాక్కొని నీ సన్నిహితులకు కట్టబెట్టావ్
మోడీపై ప్రియాంక ధ్వజం
రాయ్‌బరేలి, ఏప్రిల్ 25 (జనంసాక్షి) :చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్టు ఎన్ని కల ప్రచార సభల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించొద్దని, అధిక ప్రసంగా ఆలు ఆపాలని ప్రియాంకవాద్రా అన్నారు. పాఠశాల పిల్లలకకు పాఠాలు చెప్పినట్లు ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. గుజరాత్ అభివృద్ధి నమూనా పేరుతో పేదల భూములను తన సన్నిహితులకు
కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. శుక్రవారం రాయ్‌బరేలిలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన ప్రియాంక మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ హవా ఏమీ లేదని అదంతా మీడియా సృష్టేనని ఎద్దేవా చేశారు. గుజరాత్ నమూనాను ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారని మోడీ తన సన్నిహితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టిన విషయం అందిరికీ తెలిసిందేనన్నారు. కార్మికులకు వైద్య సేవలందించేందుకు మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. మహిళల కోసం గుజరాత్‌లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీసీ (ఆదర్శ్ స్కాం, బోఫోర్స్ స్కాం, కోల్ స్కాం), ఆర్‌ఎస్‌వీపీ (రాహుల్, సోనియా, వాద్రా, ప్రియాంక) అంటూ మోడీ చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఆపాలని.. ఆయనేం విద్యాసంస్థలనుద్దేశించి ప్రసంగించడం లేదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. ‘విూరు ఏదో విద్యాసంస్థలో ప్రసంగించడం లేదు.. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారన్న విషయం తెలుసుకోండి’ అని అన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు వారికి ఏం చేస్తారో చెప్పండి.. పాఠాలు చెప్పొందు అంటూ చురకలంటించారు. మీ అభివృద్ధి నమూనాను ప్రజలు అర్థం చేసుకున్నారని.. తక్కువ ధరకే మీ సన్నిహితులకు భూములు కట్టబెట్టిన విషయం తెలుసేనన్నారు. ‘మీరు ప్రజలను బలోపేతం చేయాలనుకుంటే మీ అభివృద్ధి నమూనాలో రైతులు ఎక్కడ ఉన్నారు? మహిళల కోసం ఏం చేశారో చెప్పండి’ అంటూ నిలదీశారు. సుస్థిర ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్‌కే ఓటు వేయాలని కోరారు. దేశ సమైక్యత కొనసాగాలంటే కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు
చిన్న పిల్లలకు పాఠాలు చెప్పినట్టు నీ ప్రసంగం ఆపు




