Monday, 2 November 2026

శోభా నాగిరెడ్డికి అంతిమ వీడ్కోలు


ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) :
అశ్రునయనాల మధ్య ఆళ్ల గడ్డ ఎమ్మెల్యే శోభానాగిరె డ్డికి వేలాదిమంది అభిమా నులు కన్నీటి వీడ్కోలు పలి కారు. ఆళ్లగడ్డలోని ఆమె నివాసం నుంచి వేలాదిగా అభిమానులు తరలిరాగా అంతిమయాత్ర సాగింది. ఆమె సొంత వ్యవసా యక్షేత్రంలో కుమారుడు చితికి నిప్పంటించారు. శోభ అంతియాత్రకు వేలదిగా ప్రజలు తరలి రావ డంతో ఆళ్లగడ్డ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. భర్త భూమా నాగిరెడ్డి, కూతుళ్లు పార్థివ దేహం వద్ద అంతిమంగా కన్నీటి వీడ్కోలు పలికారు. అం తకు ముందు ఆళ్లగడ్డకుచేరుకున్న జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు శోభకు నివాళి అర్పించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమా శోభా నాగిరెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యే క హెలికాప్టర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆళ్లగడ్డ చేరుకున్న జగన్‌ శోభానాగిరెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి, జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల కూడా శోభానాగిరెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. పలువురు వైకాపా నేతలు కూడా నివాళి అర్పించారు. శోభానాగిరెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. శోభానాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడిని జగన్‌ ఓదార్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు శోభానాగిరెడ్డి పార్థీవ దేహానికి అంజలి ఘటించారు. మరోవైపు శోభానాగిరెడ్డిని చివరిసారిగా దర్శించుకునేందుకు భారీలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు ఆళ్లగడ్డకు తరలివచ్చారు. శోభానాగిరెడ్డి అంతిమయాత్రలో జగన్‌ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. అంత్యక్రియల్లో కూడా వారు పాల్గొన్నారు. శోభానాగిరెడ్డి అంతిమయాత్ర ఆళ్లగడ్డ పట్టణంలోని ఆమె నివాసం నుంచి చేపట్టారు. వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల, భారతి అంతిమయాత్రలో పాల్గొన్నారు. శోభానాగిరెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె అంతిమయాత్రకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. బుధవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గురువారం ఆమె పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం నంద్యాలలో ఉంచారు. అనంతరం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఆమె అంతిమ యాత్ర ఆరంభమైంది. ఆమె అంతిమ యాత్రకు అశేష జనవాహిని హాజరై ఘనంగా వీడ్కోలు పలికింది. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా వెలుగొందిన శోభా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. మరోవైపు శోభానాగిరెడ్డిని చివరిసారిగా దర్శించుకునేందుకు భారీలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు ఆళ్లగడ్డకు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *