కేంద్ర కేబినెట్ నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 (జనంసాక్షి) :
ఆంధప్రదేశ్ రాష్ట్ర శాస నసభ రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే రా ష్ట్రంలో రాష్ట్రపతి పాలన పొడిగించాలని కేంద్ర కే బినెట్ రాష్ట్రపతికి సిఫా ర్సు చేసింది. శుక్రవా రం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ నివా సంలో కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పాలనను మరో రెండు నెలలు పొడిగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర కేబినెట్ సిఫార్సు చేసింది. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలలలోపు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే ఆంధప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన విధించి ఏప్రిల్ 30కి రెండు నెలలు పూర్తి కావస్తుంది. ఏప్రిల్ 30తో రాష్ట్రపతి పాలన ముగియగానే విశ్రాంతిలో ఉన్న అసెంబ్లీని తిరిగి పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పార్లమెంట్‌ను సమావేశపరిచి, రాష్ట్రపతిపాలనను కొనసాగించడం ఇబ్బందికరం కాబట్టి, విశ్రాంతిలో ఉన్న అసెంబ్లీని పూర్తిగా రద్దు చేయడమే కేంద్రం ముందున్న ప్రస్తుత అవకాశం. అందుకే కేంద్ర న్యాయ సలహా మేరకు అసెంబ్లీని రద్దు చేసి, మరో రెండు నెలలపాటు రాష్ట్రపతి పాలనను కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంటూ ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీంతో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసినట్లే. జూన్ 2న కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటుంది.
రాష్ట్ర శాసనసభ రద్దు





