Monday, 2 November 2026

ఆంధ్రా పార్టీలు ఇంకా కావాలా?


మన రాష్ట్రం.. మన పాలన.. మన జెండా : కేసీఆర్‌
మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా పార్టీలు కావాలా అంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుయ అన్నారు. త మతోనే బంగారు తెలంగాణ సాధ్యమని కేసీఆర్‌ పేర్కొ న్నారు. కాంగ్రెస్‌, టీడీపీల పాలనలో ఏం జరిగిందో అం తా చూశామని కొత్త రాష్ట్రంలో కొత్త నాయకత్వంతో సరి కొత్త దిశగా వెళ్దామని కోరారు. ‘మన రాష్ట్రంలో మన జెండనే ఎగరాలే తప్ప పక్క రాష్ట్రాల జెండాలు కాదు.. ఆంధ్ర నాయకుల పెత్తనం మనకు వద్దు’అని అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికా రంలోకి వస్తేనే తెలంగాణ పునర్నిర్మా ణం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ వల్లే వందలాది బలిదానాలు జరిగాయ ని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం గురించి, బలిదానాల గురించి నరేంద్ర మోడీకి ఏం తెలుసని ప్రశ్నించారు. శుక్రవారం కల్వకుర్తి సహా వివిధ ప్రాంతా ల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉందని.. ఎవరూ ఆగమాగం కావొద్దని సూచిం చారు. సుదీర్ఘ పోరాటం, అనేక ఆత్మ త్యాగాలు, ఆమరణదీక్షలు వల్ల తెలం గాణ వచ్చిందని అస్తిత్వాన్ని పొందడాని కి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిం దన్నారు. ’14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించు కున్నాం. లాఠీలు, తూటాల ఫలితంగా తెలం గాణ వచ్చింది. తెలంగాణ సాధించుకున్నాం.. దాన్ని ఎవరి చేతిలో పెడితో సేఫ్‌గా ఉం టుందో ఆలోచించండి’ అని ఓటర్లను కోరా రు. మన తలరాతను మనమే రాసుకోవాలని సూచించారు. టీడీపీ రూ.70 పెన్షన్‌ ఇస్తే కాంగ్రెస్‌ రూ.200 ఇచ్చి చేతులు దులుపుకుం దని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులకు,
వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్‌ ఇస్తామని హావిూ ఇచ్చారు. బడుగు బలహీనవర్గాల వారికి రూ.3 లక్షల వ్యయంతో 125 గజాల స్థలంలో రెండు పడక గదులు, హాల్‌, కిచెన్‌, బాత్‌రూం కట్టిస్తామని పునరుద్ఘాటించారు. ఇళ్లకు ఖర్చు అయ్యే డబ్బును ప్రజలు కట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీలకు రవాణా మాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. ఆటోల మీద విధించే రవాణా పన్నును రద్దు చేయడంతో పాటు అధికారుల ఒత్తిళ్లు లేకుండా చూస్తామన్నారు. విద్యతో సంబంధం లేకుండా ఆటోడ్రైవర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పిస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని పునరుద్ఘాటించారు. లంబాడీ తండాలు, గిరిజన గూడెంలను పంచాయతీలుగా మారుస్తామని, లంబాడి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఉన్న లోన్లు ఎవరు కట్టొద్దని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాయ లోన్లు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు చారిత్రక ఎన్నికలని అని, వచ్చిన తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే క్షేమంగా ఉంటుందో ఆలోచించండని కోరారు.
జైపాల్‌ ఏం చేశారు..
అత్యంత కరువు ప్రాంతమైన మహబూబ్‌నగర్‌ జిల్లాకు కాంగ్రెస్‌ ఏం చేసిందని కేసీఆర్‌ ప్రశ్నించారు. పాలమూరులో వలసలు ఎందుకు జరుగుతున్నాయి కల్వకుర్తి లిఫ్ట్‌ ఎందుకు ఆగిపోయింది అని అడిగారు. ఇక్కడ ఎందరో మహానుభావులు పని చేశారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసినా కల్వకుర్తి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. కల్వకుర్తి లిఫ్ట్‌ ప్రాజెక్టు ఇంకా ఎన్నిళ్లు పెండింగ్‌లో ఉంటుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, నెట్టింపాడు, బీమా ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామన్నారు. ‘నిన్నటిదాకా ఏపీ రాష్ట్రం ఇప్పుడిది తెలంగాణ రాష్ట్రం. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాం.. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 14 లక్షల ఎకరాలకు నీరందిస్తాం’ అని అన్నారు. ‘కాంగ్రెస్‌ పాలన 40 ఏళ్లు చూశాం.. టీడీపీ 18 ఏళ్లు పాలించింది.. ఏం జరిగిందో మనందంరం చూశాం.. కొత్త రాష్ట్రంలో కొత్త నాయకత్వంతో ముందుకు పోతేనే మనకు మంచి జరుగుతుంది. అందుకే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని’ కోరారు.
సిబిఐ విచారణను స్వాగతిస్తున్నా
తన ఆస్తులపై విచారణ జరిపించాలని సీబీఐ కోర్టు జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదేవిధంగా పొన్నాల ఆస్తులపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఆయన భూకబ్జాపై విచారణ చేయాల్సిందేనన్నారు. పీసీసీ పదవి నుంచి పొన్నాలను తప్పించాలని పునరుద్ఘాటించారు. కసితీరా పాలమూరును అభివృద్ది చేస్తాననఇ అన్నారు. హెలికాప్టర్‌ ద్వారా ఈ ఏరియా చూస్తే పచ్చగా కనిపించాలని అన్నారు. సాధించుకున్న తెలంగాణ సార్థకం కావాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్‌ కోరారు. అలంపూర్‌లో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. లాఠీలు, తూటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ సాధించుకున్నాం కానీ తెలంగాణను ఎవరి చేతిలో పెడితే సేఫ్‌గా ఉంటుందో ప్రజలే ఆలోచించుకోవాలి. సాధించుకున్న తెలంగాణ సార్థకం కావాలన్నారు. కాంగ్రెస్‌, టీడీపీల సంగతి తెలుసని అన్నారు. వీరిచేతిలో తెలంగాణ పెడితే ఆగం చేస్తారని అందుకే ఎన్నికల్లో పోటీకి టిఆర్‌ఎస్‌ నిలబడిందన్నారు. ఇక తాను ఇచ్చిన హావిూ మేరకు రైతులకు లక్ష వరకు రుణమాఫీ. ట్రాక్టర్లకు, ట్రాలీలకు రవాణా పన్ను మాఫీ చేస్తూనే ఆటో రిక్షాలకు రోడ్‌ ట్యాక్స్‌ ఉండకుండా చూస్తామన్నారు. ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పిస్తాం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అలంపూర్‌ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వేయి ఇళ్లకు నేను శంకుస్థాపన చేస్తా. మహిళా సంఘాలకు రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం ఇస్తాం. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న మంద జగన్నాదంను గెలిపిస్తే కేంద్రంలో మంత్రి అవుతారన్నారు. నాగర్‌కర్నూల్‌కు సవిూపంలోని ఉయ్యాలవాడలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల సభలో కేసీఆర్‌ మాట్లాడారు. కేసీఆర్‌ మీద సీబీఐ కేసులు పెడితే స్వాగతిస్తామన్నారు. తనపై కేసులుంటే ఎప్పుడో బొంద పెట్టేవాళ్లు అని పేర్కొన్నారు. తనపై ఎలాంటి ఆధారాలు ఉండవిన తెలిసినా కావాలనే ఇలా చేస్తున్నారని అన్నారు. అయినా తాను వెనక్కి పోయేది లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని చూడలేకనే కాంగ్రెసోళ్లు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ కాదు డీబీఐ వచ్చి విచారణ చేసినా స్వాగతిస్తానని తెలిపారు. తాను నిప్పులాగా పెరిగిన మనిషిని తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పారు. దళితుల భూములను దోచుకున్న పొన్నాల లక్ష్మయ్య పెద్ద గజ దొంగ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. గజ దొంగను పీసీసీ చీఫ్‌ ఎలా చేస్తారని ప్రశ్నించారు. పొన్నాలతో పీసీసీ పదవికి రాహుల్‌ రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. దళితుల వద్ద తీసుకున్న భూములను పొన్నాల ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని చూడలేకనే పొన్నాల సీబీఐతో బెదిరిస్తున్నారని చెప్పారు. జిల్లాలో నాగర్‌కర్నూల్‌ వెనుకబడ్డ ప్రాంతం అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. పాలమూరు జిల్లా భయంకరమైన వలసల జిల్లా. కరువుతో చితికిపోయింది. ఈ జిల్లా బాధలు నాకు తెలుసు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎంపీగా తెలంగాణ సాధించిన. ఆ క్రెడిట్‌ పాలమూరుకే దక్కుతది. నాగర్‌కర్నూల్‌కు సాగరు నీరందిస్తాం. పాలమూరు కరువు తీరాలంటే నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలి. అవసరమైతే ఇక్కడే కూర్చోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పాలమూరు జిల్లాలో 14 లక్షల ఎకరాలు సాగయ్యేలా చూస్తాం. కరువు తీరాలంటే టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం పొరపాటు జరిగినా భవిష్యత్‌ తరాలు బాధపడుతాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటలు కరెంట్‌ ఇప్పించే బాధ్యత నాదే. తప్పిపోయి కాంగ్రెస్‌ నేతల చేతిలో తెలంగాణను పెడితే నష్టపోతాం. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మన కష్టాలు తీరుతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *