
కేసీఆర్ తాటతీస్తా : పవన్ కల్యాణ్
వరంగల్, ఏప్రిల్ 26 (జనంసాక్షి) :
జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రజల సమక్షంలో అధిక ప్రసంగం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని దూషిస్తే తాటతీస్తానంటూ టీఆర్‌ఎస్ అధ్య క్షుడు కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో సుష్మా
స్వరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ కాబోయే బీసీ ప్రధాని నరేంద్రమోడీని దురహంకారంతో విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోనని కేసీ ఆర్‌ను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ ఏరుదాటాక తెప్ప తగలే సే రకమని, వరంగల్ నడిగడ్డ నుంచి ఈ వ్యాఖ్యలు చేస్తున్నా నని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి ఎందరు పోటీ చేసినా తప్పులేదు కానీ వేరేవాళ్లు పోటీ చేస్తే దాడులు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. బూతులు తిడితే ఆయన చేతికి చిప్పే వస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో వ్యాపార సంబంధాలున్నాయని తెలిపారు. తాను మద్దతిచ్చిన నేతలు ప్రజా సమస్యలు పట్టించుకునేలా చూస్తానని చెప్పారు. ఒకవేళ తన మద్దతుతో గెలిచినా వారు సమస్యలు పట్టించుకోకపోతే వారి సంగతి తేలుస్తానని హెచ్చరించారు.
అధిక ప్రసంగం




