Monday, 2 November 2026

గుజరాత్‌ మోడల్‌ను దేవుడే కాపాడాలి


రోజుకు 11 రూపాయల ఆదాయం దరిద్రుడు కాదట
ప్రతి ముగ్గురిలో ఓ చిన్నారికి పౌష్టికాహారలోపం
సన్నిహితునికి 45 వేల ఎకరాలు దారాదత్తం
పేదలను కొట్టడం..
పెద్దలకు పెట్టడం
ఇదే గుజరాత్‌ అభివృద్ధి
నిప్పులు చెరిగిన సోనియా
మాల్వా, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) :
గుజరాత్‌ అభివృద్ధి నమూనా పేరుతో దేశ ప్రజలను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్రమోడీ మభ్య పెడుతున్నారని, దేశాన్ని గుజరాత్‌ మోడల్‌ నుంచి ఆ దేవుడే కాపాడా లని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. శనివారం పంజాబ్‌లోని మా ల్వాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సోనియా మాట్లాడారు. గుజరాత్‌ అభివృ ద్ధి నమూనాతో అక్కడి సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలి పారు. గుజరాత్‌లో 50 ఏళ్లుగా నివసిస్తున్న సిక్కులను ఆ రాష్ట్రం తరిమేస్తున్నారని ఆమె తెలిపారు. బీజేపీతో చేతులు కలిపిన అకాలీదళ్‌ గుజరాత్‌లోని సిక్కులకు మద్ద తుగా గొంతు విప్పడం లేదని ఆమె అన్నారు. గుజరాత్‌లో ప్రతి సెకండుకు ఒక ఐదే ళ్ల బాలిక పౌష్టికాహారలోపానికి గురవుతుందని, ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు పౌష్టి కాహార లోపంతో బాధ పడుతున్నారని తెలిపారు. రోజుకు 11 రూపాయలు సంపా దించేవారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు గుజరాత్‌లో గుర్తించడం లేదని తెలిపారు. మోడీకి సన్నిహితుడైన ఓ కార్పొరేట్‌ దిగ్గజానికి 45 వేల ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెట్టారని ఆమె తెలిపారు. పేదలను కొట్టడం.. పెద్దలకు పెట్టడం ఇదే గుజరాత్‌ అభివృద్ధి అని ఆమె విమర్శించారు. గుజరాత్‌లోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలకు కనీసం బిందెడు తాగునీరు దొరకడం లేదని ఆమె పేర్కొన్నారు. బీజేపీ అవలంబిస్తున్న సిద్ధాంతాలు సామాన్యుడిని అతని తెలివి తేటలు, శక్తి సామర్థ్యాలతో కాకుండా మతం, భాష, కులం ఆధారంగా గుర్తిస్తున్నారని, ఇంతటి దుర్మార్గం మరెక్కడా లేదని ఆమె తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలు రగల్చి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు. యావత్‌ దేశాన్ని ఒక్క వ్యక్తికి చేతికి అప్పగించడమే బీజేపీ సిద్ధాంతమని ఆమె ఆక్షేపించారు. పేదలు, బలహీనవర్గాలు, రైతులు తమ హక్కుల కోసం అడుక్కునే దుస్థితి గుజరాత్‌లో నెలకొందని, రేపు మోడీ ప్రధాని అయితే దేశం మొత్తం ఇంతటి దౌర్భాగ్యాన్ని భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతులు, పేదలు, బలహీనవర్గాలు, దేశంలోని ప్రతి పౌరుడు సమాన అవకాశాలు పొందడం, ప్రగతిపథంలో ముందుకు నడవడం, శాంతి సామరస్యాలతో జీవనం సాగించడం కాంగ్రెస్‌ పార్టీ అభిమతమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *