
కేసీఆర్ సుడిగాలి పర్యటన
వరంగల్, ఏప్రిల్ 26 (జనంసాక్షి) :టీఆర్ఎస్తోనే తెలంగాణ అభి వృద్ధి సాధ్యమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన శనివారం వరంగల్, కరీంనగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో సుడి గాలి పర్యటన నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. దళితుల భూము లు కబ్జా చేసిన పొన్నాల లక్ష్మయ్య భూములను తిరిగి ఇచ్చివేయాలని డిమాండ్ చేశారు. తాను దొరనంటూ విమర్శలు చేస్తున్న పొన్నాల వెంట నే రాంపూర్‌లో ఆక్రమించుకున్న భూములను అప్పగించాలన్నారు. టీప ీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య 9 ఎకరాల దళితుల భూమిని కబ్జా చేసిండని విమర్శించారు. ఈ విషయంలో కలెక్టర్
కూడా చర్య తీసుకోవాలన్నారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్ సభలో కెసిఆర్ మాట్లాడుతూ పొన్నాలపై ఫైర్ అయ్యారు. దొంగ ఎవరో దొర ఎవరో తేలుతుందన్నారు. టీడీపీ ఎప్పటికీ ఆంధ్రా పార్టీ అని అన్నారు. దానిని తరిమి కొట్టాలన్నారు. తెలంగాణలో తెలంగాణ జెండాలే వుండాలని ఆంధ్రపార్టీల జెండాలు వద్దని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఉద్యమంలో ఉంటే కాంగ్రెస్ నేతలు మంత్రి పదవుల కోసం పరిగెత్తారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తెరాస మెజార్టీ సాధించి తెరాస ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. నరేంద్రమోడీ ఇద్దరు ఆంధ్రోళ్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను వెంటబెట్టుకొని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన మోడీ ఓ పిచ్చిదొంగ అని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల బాధలు 60 ఏళ్లనుంచి వున్నాయన్నారు. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వుండి తెరాసను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మోడీకి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదన్నారు. ఆంధ్రా బాబుల పక్కన కూర్చొని మోడీకి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజు భారతమాత ఏడవలేదు సంతోషించిందని మోడీకి గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్ని తల్లుల పుస్తెలు తెగిపోయాయో తెలుసా? ఎంతమంది చనిపోయారో తెలుసా అని ప్రశ్నించారు. ఏ తల్లి చనిపోయింది.. ఏ పిల్ల బతికిందని ప్రశ్నించారు. తమది 60 ఏండ్ల దుఖమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మన పార్టీ కాదని అది ఆంధ్రా పార్టీ అని చంద్రబాబు ఆంధ్రా బాబు కేసీఆర్ అన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం.. అమరణ దీక్ష.. సకల జనుల సమ్మెలతో మ¬ధృతంగా సాగిన ఉద్యమంతో తెలంగాణ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుపడ్తదో అందరూ ఆలోచించి ఓటేయాలని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని చారిత్రక నేపథ్యం ఉన్న ఎన్నికలని తెలిపారు. ఓటేయడంలో చిన్న తేడా వచ్చినా తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని మరోసారి ప్రజలకు స్పష్టం చేశారు. తెలంగాణలో మూడేళ్ల వరకు కరెంటు బాధలు తప్పవని.. ఆ తర్వాత 24 గంటల విద్యుత్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక్కడ పోటీలో ఉన్న రాజయ్యను, కడియం శ్రీహరిలను ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించాలన్నారు.
మోడీకి తెలంగాణ గురించేం తెలుసు?
మ¬త్తర ఉద్యమ ఫలితంగా సాధించుకున్న తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణకు ప్రతి రంగంలో అన్యాయం జరిగిందని వివరించారు. తెలంగాణకు నీళ్లు అంటే లిఫ్టు ద్వారా తీసుకు పోవాలి, ఖర్చు ఎక్కువ అని ఆంధ్రాపాలకులు అనేవారని తెలిపారు. ఆ నీటిని ఆంధ్రాకు తెఫ్ట్ చేసి తీసుకుపోయేవారని విమర్శించారు. ఇలా అన్ని రంగాల్లో మనకు అన్యాయం జరిగిందన్నారు. ఇంకా కూడా ఆంధ్రోళ్లతో పంచాయతీ అయిపోలేదని నీళ్లు, నిధులు, ఉద్యోగాలు పంచుకునేది ఉందని తెలిపారు. ఉద్యోగాల పంచాయితీ తెగాల్సి ఉందన్నారు. అందుకే వీటి కోసం పోరాడే ఇంటి పార్టీ టీఆర్ఎస్ను గెలిపించాలని కేసీఆర్ కోరారు. టిడిపి ఆంధ్రా పార్టీ అని, బీజేపీకి ఓటేస్తే టిడిపికి వేసినేట్లేనన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన మోడీ ఓ సన్నాసి అని కేసీఆర్ విమర్శించారు. మోడీకి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదన్నారు. ఇక్కడి ప్రజల ఆర్తి తెలియదన్నారు. జనగాంలో ఉన్న నీటి బాధలు తెలియవన్నారు. ఆంధ్రా బాబుల పక్కన కూర్చొని మోడీకి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజు భారతమాత ఏడవలేదు.. సంతోషించిందని మోడీకి గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్ని తల్లుల పుస్తెలు తెగిపోయాయో తెలుసా? ఎంతమంది చనిపోయారో తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుతో తల్లి సచ్చింది పిల్ల బతికిందట ఏ తల్లి చనిపోయింది ఏ పిల్ల బతికిందని ప్రశ్నించారు. తమది 60 ఏండ్ల దుఖమని చెప్పారు. మోడీ తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు తానిచ్చిన హావిూ మేరకు అన్ని నెరవేరుస్తానన్నారు.
కాంగ్రెస్, టీడీపీలతోనే తెలంగాణ ఆగమైందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరోసారి వారికి అధికారం అప్పగిస్తే తెలంగాణ మరింత వెనుకబాటుకు గురవుతుందని హెచ్చరించారు. ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ సురిక్షతంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీ-బీజేపీలకు ఓటు వేస్తే ఆంధ్ర పాలనను కోరుకున్నట్లేనని హెచ్చరించారు. మోడీ ప్రభావం ఏవిూ లేదని, తెలంగాణలో వారికి ఒక్క సీటు కూడా రాదన్నారు. నారాయణఖేడ్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ‘నారాయణఖేడ్‌ను దత్తత తీసుకుంటా.. విూ సమస్యలు తీర్చే బాధ్యత నాది. నారాయణఖేడ్‌పై గులాబీ జెండా ఎగురవేయండి’ అని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థులు భూపాల్‌రెడ్డి, బీబీ పాటిల్‌ను ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపించాలని కోరారు. 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నికలు వచ్చాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో మన తలరాతను మనమే రాసుకుందామని, తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. 40 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీ పాలించినా తెలంగాణకు చేసిందేవిూ లేదన్నారు. 40 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ ఏనాడు తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు ఆంధ్రబాబేనని, ఇంకా తెలంగాణలోనే ఉంటానని మొండికేస్తున్నాడని మండిపడ్డారు. ఆంధ్రలో రాజకీయం చేసుకోమ్మంటే ఈడనే ఉంటానని.. ప్రజలంతా మెడ పట్టి పొమ్మన్నా పోతలేడని విమర్శించారు. ఇప్పటికీ కొంత మంది తెలంగాణ నాయకులు ఆంధ్ర బాబుల మోచేతి నీళ్లు తాగుతున్నారని, వారి పల్లకీలు మోస్తున్నారని టీడీపీ నేతలను విమర్శించారు. ఆంధ్ర నాయకుడి ప్రోద్బలంతోనే పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడి పదవి తెచ్చుకున్నాడని ధ్వజమెత్తారు. సన్నాసి, చవట అంటూ తనదైన శైలిలో పొన్నాలపై విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి గీతారెడ్డిపై కేసీఆర్తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మినిస్టర్ అని విమర్శించారు. గీతారెడ్డిని గెలిపిస్తే జహీరాబాద్ అభివృద్ధి చెందదన్నారు. సీబీఐ కేసులో ఆమె ఎప్పుడైనా జైలుకెళ్లే అవకాశముందన్నారు. ఇన్నేళ్లుగా జహీరాబాద్‌కు గీతారెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో ఆమెకు ఓటమి తప్పదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం చాలా అవసరమని కేసీఆర్ అన్నారు. 90 సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తామని పేర్కొన్నారు. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని, ట్రాక్టర్లు, ట్రాలీలకు రవాణా పన్ను మినహాయింపునిస్తామని పునరుద్ఘాటించారు. వృద్ధులు, వితంతువులకు రూ1000, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పారు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని, వక్ఫ్‌బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు ఇస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణలో కాంట్రాక్ట్ అన్న పదమే ఉండదన్నారు.
తెరాసతోనే తెలంగాణ అభివృద్ధి




