Monday, 2 November 2026

సుప్రీం సీజేగా లోధా ప్రమాణం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) :
సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌ఎం లోధా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. లోధాచే భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించినప్రమాణస్వీకారోత్సవానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు న్యాయ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జోద్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయశాఖలో పట్టభద్రులైన లోధా రాజస్థాన్‌ హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సదాశివం పదవీకాలం శనివారంతో ముగిసింది. లోధా 2014 సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *