
సీబీఐతో సంప్రదిస్తాం : డీజీపీ
హైదరాబాద్, ఏప్రిల్ 27 (జనంసాక్షి) :
టైటానియం ఖనిజం తవ్వకాల కుంభకోణం వ్యవహారం కేసులో సీబీఐ నుంచి రెడ్‌కార్నర్ నోటీసులు అందినట్టు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఆదివారం నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేవీపీ కేసుకు సంబంధించి ప్రొవిజినల్ అరెస్టు వారెంట్ రాలేదని, దీనిపై సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. కేవీపీ ఎంపీ అయినందునా ఆయనపై నిఘా పెట్టలేకపోతున్నామని తెలిపారు. ప్రజల మధ్య ఉండేవాడు కాబట్టి అతనిపై ప్రత్యేక నిఘా అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతని అప్పగింత ప్రక్రియ పూర్తయ్యేవరకు అదుపులో ఉంచుకోవాలని కోరిన ప్రొవిజనల్ అరెస్టు మాత్రం వారెంట్ పంపలేదని తెలిపారు. దీనికి సంబంధించి సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపినట్టు చెప్పారు. చుండూరులో దళితుల ఊచకోతకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయబోతున్నట్టు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆధారాలు లేకుండా తరలించిన 120 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎన్నికల కోడ్‌నేపథ్యంలో 3 వేల మందిపై కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దేశంలో అత్యధికంగా నగదు పట్టుబడింది మన రాష్ట్రంలోనేనని చెప్పారు. మొదటి దశ ఎన్నికలకు పోలింగ్ సిబ్బందిని సంసిద్ధం చేశామని, సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఆ తాఖీదు అందింది




