
రాయ్‌బరేలి, ఏప్రిల్ 27 (జనంసాక్షి) :
ఆరోపణలకు భయపడబోనని కాం గ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా అన్నా రు. ఆదివారం రాయ్‌బరేలిలో తన తల్లి తరపున ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఈ సందర్భంగా గు జరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధా ని అభ్యర్థి నరేంద్రమోడీకి చురక లాంటించారు. దేశాన్ని
నడపడానికి 56 అంగుళాల ఛాతీ అవసరం లేదంటూ మోడీపై మండిపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌ను గుజరాత్‌లా మార్చాలంటే 56 అంగుళాల ఛాతీ కావాలంటూ ఆయన ములాయంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీలో 365 రోజుల 24 గంటల పాటు అంతరాయం లేకుండా విద్యుత్ ఇవ్వాంటే అందుకు దమ్ము కావాలని మోడీ అన్నారు. దేశాన్ని నడపడానికి ఛాతీ బలంతో పనిలేదని, అందుకు పెద్ద హృదయం కావాలని ఆమె పేర్కొన్నారు. లౌకికవాద దేశమైన భారత్‌ను నడపడానికి క్రూరమైన శక్తితో పనిలేదని, నైతిక బలం, మనోబలం కావాలంటూ ఆమె ఉద్భోదించారు. దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని కాపాడేందుకు అవసరమైతే జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ దేశం అన్ని మతాలు, కులాలు, జాతులకు చెందినది, ఈ దేశం కోసం మహత్మాగాంధీ తన ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ దేశ రక్తం తన నరనరాల్లో ప్రవహిస్తోందని ఆమె చెప్పారు. దేశాన్ని శక్తిమంతం చేసేందుకు, దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రజలు ఓట్లేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాను ఎలాంటి ఆరోపణలకు బెదరబోనని ఆమె తేల్చిచెప్పారు.
ఆరోపణలకు భయపడను : ప్రియాంక




