Monday, 2 November 2026

పోలింగ్‌కు అంతరాయం కల్పిస్తే కఠిన చర్యలు


90 వేల మంది పోలీసులు విధుల్లో : డీజీపీ
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) :
తెలంగాణలో నేడు జరుగనున్న ఏడో విడత లోక్‌సభ పోలింగ్‌కు పోలీసు అధి కారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం తెలం గాణలో జరిగే పోలింగ్‌ విధులకు 90 వేల మంది పోలీసు బల గాలను నియమించినట్లు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. మంగళ వారం రాష్ట్ర పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా
సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌ బందోబస్తుకు 158 కంపెనీల పారామిలిటరీ బలగాలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. బందోబస్తు కోసం 59 కంపెనీల ఏపీఎస్పీ బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల కోసం 4 వైమానిక దళ హెలిక్టాపర్లు వాడుతున్నామన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడిక్కడ ఏర్పాట్ల గురించి వివరించారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 123 కోట్లు, 89 కిలోల బంగారం పట్టుకున్నామని డీజీపీ తెలిపారు. 28 వేలకు పైగా కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదుచేశామన్నారు. ఇప్పటివరకు 3లక్షల 7వేల మందిని బైండోవర్‌ చేశామన్నారు. ఈమేరకు డీజీపీ ప్రసాదరావు వివరాలు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లను వినియోగించనున్నట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు తెలంగాణలో జరుగనున్న ఏడో విడత పోలింగ్‌కు పోలీసు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 14 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్టు డీజీపీ ప్రసాదరావు వెల్లడించారు. వీరంతా ఐజీ, డీఐజీ క్యాడర్‌ స్థాయికి చెందినవారుగా పేర్కొన్నారు. హైదరాబాద్‌-గోవింద్‌సింగ్‌, వేణుగోపాల్‌, కష్ణ, శ్రీనివాస్‌రావు, యోగానంద, వినయ్‌రాజన్‌ రాయ్‌, సైబరాబాద్‌ వరంగల్‌- సీఎస్‌కే రాజు, మెదక్‌-శ్రీకాంత్‌, మహబూబ్‌నగర్‌ – తివిక్రమ్‌వర్మ, కరీంనగర్‌-చంద్రశేఖర్‌రెడ్డి, రంగారెడ్డి- రవిచంద్ర, నల్లగొండ ఆదిలాబాద్‌-రజత్‌కుమార్‌ పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. ఇదిలావుంటే జంటనగరాల్లో ఏర్పాట్లను కమిషనర్‌ పర్యవేక్షించారు. హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ ఈరోజు పాతబస్తీలో పర్యటించారు. చార్మినార్‌ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనర్‌ వెంట పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇదిలావుంటే ఆంధప్రదేశ్‌ రాజధానిగా హైదారాబాద్‌లో చివరి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ సందర్బంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నగరంలో 379 పోలింగ్‌ బూత్‌లను అత్యంత సమస్యాత్మకంగా అధికారులు గుర్తించారు. మరో 304 పోలింగ్‌ బూత్‌లను సమస్యాత్మకంగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *