Monday, 2 November 2026

నిబంధనలు ఉల్లంఘించిన మోడీపై కేసు

అహ్మదాబాద్‌, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) :
ఎన్నికల సంఘం నిబంధనలు అతిక్రమించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై పోలీసు లు కేసు నమోదు చేశారు. ఆయన బుధవా రం తన ఓటు హక్కు వినియోగించుకున్న అ నంతరం మీడియాతో మాట్లాడుతున్న సమ యంలో కమలం పువ్వు గుర్తు చూపించారు. దీనిపై కాంగ్రెస్‌ నాయకుల
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. గాంధీనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మోడీ పార్టీ గుర్తు ప్రదర్శించారని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. నిబంధనల ప్రకారం ఓటింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం చేయకూడదు. అయితే, ఓటు వేసిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ పార్టీ గుర్తు చూపించడం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాయి. అలా చేయడం ఎన్నికల నియామవళికి విరుద్ధమని పేర్కొన్నాయి. ప్రజాప్రాతినిథ్య చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరాయి. దీంతో కేసు నమోదు చేయాలని ఈసీ గుజరాత్‌ పోలీసులను ఆదేశించింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మరోమారు నిప్పులు చెరిగారు. దేశం గురించి పట్టించుకోని కాంగ్రెస్‌.. మోడీ సమస్యను ఎలా అధిగమించాలని యత్నిస్తోందన్నారు. దేశంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తాను అన్వేషిస్తుంటే.. ‘మోడీ’ అనే సమస్యను ఎలా అధిగమించాలని తన ప్రత్యర్థి (కాంగ్రెస్‌) పార్టీ తీవ్రంగా శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి దేశంలో నెలకొన్న అవినీతి, పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర సమస్యల పరిష్కారం కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇదే సమయంలో ‘మోడీ’ అనే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందన్నారు. బీజేపీ దేశాన్ని రక్షించేందుకు యత్నిస్తుంటే, ఇతరుల తమను తాము రక్షించుకొనేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పాలన విషయంలో తాము విఫలమయ్యామని కాంగ్రెస్‌ అంగీకరించిందని, ఇప్పుడు కేవలం పార్టీ పరువును కాపాడుకొనేందుకు ఆ పార్టీలోని పలువురు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైనవిగా మోడీ అభివర్ణించారు. ఈ ఎన్నికలు తమకు కొత్త శక్తిని ఇస్తాయన్న మోడీ.. 21వ శతాబ్దపు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *