Monday, 2 November 2026

మోడీ ప్రధానికి పనికిరాడు : అమర్త్యాసేన్‌

కోల్‌కతా, ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) :
నరేంద్రమోడీ ప్రధాని పదవికి పనికిరాడని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యాసేన్‌ అభిప్రా యపడ్డారు. ప్రధాని పదవి చేపట్టడానికి ఆయన తగిన వ్యక్తి కాకపోవచ్చని అమర్త్యాసేన్‌ అన్నారు. బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చినప్పుడు కూడా ఆయన మోడీ నాయకత్వంపై పెదవి విరిచారు. తాజాగా మరోమారు ఆయన మోడీపై తన అభిప్రాయానికి కట్టుబ డ్డట్లు చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని
బోల్పూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బుధవారం ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవికి నరేంద్ర మోడీ తగిన వ్యక్తి కాకపోవచ్చన్నారు. మోడీకి కొన్ని వర్గాల్లో విపరీతమైన ప్రచాదరణ ఉందన్నది వాస్తవమని తెలిపారు. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఆయనకు ఆదరణ ఎక్కువగా ఉందన్నారు. అంతమాత్రాన ఆయనను ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేను అని ఆయన పేర్కొన్నారు. మరింత లౌకిక వాది అయివుండి, అల్ప సంఖ్యాక వర్గాలైన ముస్లింలు, కైస్త్రవులు నిర్భయంగా జీవించే ధైర్యాన్ని ఇవ్వగల నేత దేశానికి నాయకుడు కావాలని సేన్‌ ఆకాంక్షించారు. ఆయనలో అలాంటి ఆలోచనలు లేవని సేన్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *