
స్పష్టం చేసిన చిదంబరం
న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) :
రైతు రుణమాఫీ హామీపై కేంద్ర ఆర్థిక మంత్రి చిదరబరం స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ
ఇచ్చారు. రైతు రుణాల మాఫీ అనేది కేంద్రం చేతిలోనే ఉంటుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుందని, మిగతా దేశం మొత్తానికి ఈ హామీ అమలు చేయబోమని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందు పర్చామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు రుణమాఫీ వర్తించబోదని ఆయన వివరణ ఇచ్చారు
రైతు రుణమాఫీలు తెలంగాణ, ఆంధ్రాకే




