
మోడీలా నేను బాలికలను బూటకపు ఎన్కౌంటర్లలో చంపలేదు : దిగ్విజయ్
హైదరాబాద్, మే 1 (జనంసాక్షి) :
టీవీ యాంకర్‌తో తనకు ఉన్న సంబంధం వ్యక్తి గత విషయమని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజ య్‌సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇతరు ల జోక్యం మంచిది కాదని హితవు పలికారు. గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం సంద ర్భంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఐఎన ్టీయూసీ జెండాను దిగ్విజయ్ ఎగు రవేశారు. అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడారు. ఈ సందర్భంగా అమృతారాయ్‌తో మీ వివాహం ఎప్పుడు అని విలేకరులు ప్రశ్నించిన ప్పుడు ఆ యన పైవిధంగా స్పందించారు. గుజ రాత్ ము ఖ్యమంత్రి నరేంద్ర మోడీలా తాను పిరి కి వాడిని కానని ఎద్దేవా చేశారు. తన భార్య విషయాన్ని మోడీ 30 ఏళ్లు దాచి పెట్టారని
ధ్వజమెత్తారు. తాను మాత్రం టీవీ జర్నలిస్టు అమృతారాయ్‌తో తన వివాహం వ్యక్తిగతమైనప్పటికీ, ఆమెతో తనకు గల సంబంధాన్ని దాచి పెట్టలేదని ధైర్యంగా బహిరంగ పరిచానని చెప్పారు. అమృతతో తన వివాహం విషయంలో ఎటువంటి విమర్శలు ఎదురైనా దైర్యంగా ఎదుర్కొనగలనని వెల్లడించారు. అమృతారాయ్‌కు కోర్టు విడాకులు మంజూరు చేసిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. నరేంద్ర మోడీ చట్టాలను ఉల్లంఘించే వ్యక్తిగా దిగ్విజయ్ ఈ సందర్భంగా అభివర్ణించారు. అందుకు పోలింగ్ రోజున ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆయన వివరించారు. పార్లమెంట్లో ఆహార భద్రతా బిల్లును కార్పొరేట్ సంస్థలు వ్యతిరేకించాయని, అయితే అవే కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు మోడీని సమర్థిస్తున్నాయని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, పదేళ్లలో తమ పార్టీ పాలనలో దేశంలో ఆర్థిక వృద్ధి రేటు సాధ్యమైందని వెల్లడించారు. యూపీఏ హయాంలో గణనీయమైన ప్రగతి సాధించామని తెలిపారు. ఆర్థికాభివృద్ధి బాగా పెరిగిందని, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిూలను నెరవేర్చిందని చెప్పారు. యూపీఏ హయాంలో అనేక కీలక బిల్లులను తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ అధిగమిస్తామని, ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన హావిూని నెరవేర్చుకున్నామని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్టాల్రు కూడా దేశంలో అగ్ర స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోని అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. దేశ సంపదకు కార్మికుల కృషే కారణమన్నారు.
అది నా వ్యక్తిగతం




