Monday, 2 November 2026

నేను రాజీవ్‌ కూతుర్ని


మోడీ నాకు తండ్రిలాంటి వాడు కాదు : ప్రియాంక
అమేథీ/న్యూఢిల్లీ, మే 1
(జనంసాక్షి) :
ప్రియాంక గాంధీని తన కుమార్తెగా పరిగణిస్తానని బీజేపీ ప్రధా ని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించినట్లు వెలువడిన వార్తలపై ప్రియాంకగాంధీ సూటిగా, ఘాటుగా స్పందించారు.”నేను రాజీ వ్‌ గాంధీ కుమార్తెను” అని ప్రియాంక జవాబిచ్చారు. తనకు మోడీ తండ్రిలాంటివాడని కూడా ఆమె తేల్చిచెప్పారు. తన సోద రుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న ఆమేధీ నియోజకవర్గంలో గురువారం విస్తృతంగా పర్యటించిన ప్రియాంక గాంధీతో విలేక రులు ముచ్చటించారు. ప్రియాంక గాంధీ తనకు కుమార్తె వంటి దని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు వెలువడిన వార్తల గురించి విలేకరులు ఆమె స్పందన కోరినపుడు ఆమె నుంచి ఆరకంగా స్పందన వ్యక్తమైంది. నరేంద్ర మోడీ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యల గురించి కేంద్ర మంత్రి పి. చిదంబరం వద్ద ప్రస్తావించినపుడు, ”కాంగ్రెస్‌ అధినేత్రి కుమార్తె గుజరాత్‌ ముఖ్యమంత్రిని ”పితృ సమానుడిగా” పరిగణిస్తుందో లేదో తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. ”ప్రియాంక గాంధీ తనకు కుమార్తెలాంటిదని నరేంద్రమోడీ పరిగణించడం చాలా సంతోషం. కాని మోడీని తన పితృసమానుడిగా ప్రియాంక పరిగణిస్తుందో లేదో నేను చెప్పలేను” అని చిదంబరం వ్యాఖ్యానించారు. గుజరాత్‌ దూరదర్శన్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ప్రియంకను గురించి ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తొంది. అయితే ఈ వ్యాఖ్యలను మాత్రం దూరదర్శన్‌ ప్రసారం చేయకుండా ఎడిట్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *