
గాలింపు బృంద నాయకుడు అన్ఘుస్ హ్యూస్టన్
కౌలాలంపూర్, మే 2 (జనంసాక్షి) :
అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ తెలుసుకోవడానికి మరో ఏడాది పట్టొచ్చని గాలింపు బృందానికి నాయకత్వం వహిస్తున్న రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అన్ఘుస్ హ్యూస్టన్ తెలిపారు. అదృశ్యమైన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఆచూకీ తెలుసుకునేందుకు చేపట్టిన చర్యలను ఆయన
శుక్రవారం కౌలాలంపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెళ్లడించారు. విమానం ఆచూకీ కనుక్కోవడానికి కనీసం 8 నెలల నుంచి గరిష్టంగా 12 నెలల సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. విమానం గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే విమానం జాడ కనుక్కోవడానికి మరో ఏడాది వరకు సమయం పట్టవచ్చని హ్యూస్టన్ చెప్పారు. విమానం జాడ కనుక్కోవడానికి మలేషియా నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం లేదని మృతుల బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో హ్యూస్టన్ ప్రకటన వాళ్ల ఆందోళనను మరింత తీవ్రమయింది. 2014 మార్చి 8న 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎంహెచ్-370 విమానం కలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరింది. మరుసటి రోజు ఉదయం బీజింగ్‌కు చేరుకోవాల్సిన ఈ విమానం ఆచూకీ లేకుండా పోయింది. మొదట విమానం హైజాక్ అయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేయగా, కుట్రకోణంలోనూ దర్యాప్తు సాగించారు. ఎంతకీ విమానం ఆచూకీ చిక్కకపోవడంతో బంగాళాఖాతంలో అది కూలిపోయినట్టుగా నిర్దారణకు వచ్చారు. ఆస్ట్రేలియన్ ఉపగ్రహం బంగాళాఖాతం విమాన శకలాలను పోలిన వస్తువులను గుర్తించడంతో విమానం కూలిపోయినట్టుగా మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అందులో ప్రయత్నిస్తున్న వారంతా మృతిచెందినట్లుగా వెల్లడించింది. అప్పటి నుంచి విమాన శకలాల కోసం గాలిస్తున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగి ఉంటుందో గుర్తించేందుకు ఏకైక ఆధారమైన బ్లాక్‌బాక్స్ జాడకోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈనేపథ్యంలో మలేషియా ప్రభుత్వ తీరును బాధిత కుటుంబాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
మలేషియా విమాన ఆచూకీకి మరో ఏడాది పట్టొచ్చు




