
న్యూఢిల్లీ, మే 2 (జనంసాక్షి) :మోడీ నా మిత్రుడా, ఇదో పెద్ద జోక్ అం టూ కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ కొట్టిపారేశారు. మోడీతో తనకు ఎ లాంటి అనుబంధం లేదని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్ తనకు మంచి మి త్రుడని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను అహ్మద్ పటేల్ ఖండించారు. తనకు బీజేపీలో ఎవరూ మిత్రులు లేరని అహ్మద్‌పటేల్ స్పష్టం చేశారు. అహ్మద్‌పటేల్ తనకు మంచి స్నేహితుడని ఓ ఇంటర్వ్యూలో మోడీ చెప్పిన విషయం విదితమే. అంతేగాకుండా పటేల్‌దీ గుజరాతే కావడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ప్రియాం క తనకు కూతరులాంటిదని, పటేల్ తనకు మిత్రుడని మోడీ చెప్పారు. దీంతో ప్రియాంక తీవ్రంగా స్పందించారు. తాను రాజీవ్ గాంధీ కుమార్తెనని ఆమె స మాధానమిచ్చారు. నా తండ్రి ఈ దేశం కోసం చనిపోయారు. ఆయన అమ రుడు. నా జీవితంలో ఆయనను ఆరాధించినంతగా ఎక్కువగా మరెవర్నీ ఆరా ధించను. నా హృదయంలో.. మరో వ్యక్తిని ఆయనతో పోల్చుకోలేనని ప్రియాం క నిర్మొహమాటంగా పేర్కొన్నారు. మోడీని పితృ సమానుడిగా భావించడానికి ప్రియాంక ఇష్టపడకపోవచ్చన్న కేంద్ర ఆర్థిక మంత్రి
చిదంబరం వ్యాఖ్యలపై భాజపా అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. తండ్రి వయసులో ఉన్నవారిని పితృ సమానుడిగా భావించడం భారత సంస్కృతిలో భాగమన్నారు. ఇలాంటి సంస్కృతిని ఆమోదించే అలవాటు కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే లేదని విమర్శించారు. ఇక ఇప్పుడు అహ్మద్ పటేల్ ఊడా మోడీని స్నేహితుడిగా అంగీకరించనని, తనకు బీజేపీలో అలాంటి వారు లేరన్నారు. దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ వ్యాఖ్య చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ భాగాన్ని ఆ ఛానల్ ప్రసారం చేయలేదు. గుజరాత్‌లోని దూరదర్శన్ కేంద్రం తనను ఇన్నేళ్లపాటు పట్టించుకోలేదని, ఇప్పుడు తన ఇంటర్వ్యూ కోసం విజ్ఞప్తి చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్న వ్యాఖ్యలను కూడా ఆ ఇంటర్వ్యూలో మోడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ముఖాముఖిలోని కొన్ని భాగాలను ఎడిట్ చేయడాన్ని భాజపా తప్పుపట్టింది.




