ఫలితాలు విడుదల చేసిన గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్
హైదరాబాద్, మే 3 (జనంసాక్షి) :
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అమ్మాయిలు ఎప్పట్లాగానే అద్వితీయమైన ఫలితాలు సాధించారు. గతే డాదితో పోలిస్తే ఈ యేడు రెండు శాతం ఫలితాలు పెరిగాయి. కృష్ణా జిల్లా ముందంజంలో నిలిచింది. శనివారం ఉదయం గవర్నర్ సలహాదారుడు స లావుద్దీన్ అహ్మద్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 65.57 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో 82శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 49 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయి. ఈ సారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 2 శాతం పెరిగింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలు 67.52 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 61.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ కాలేజీల్లో 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నెల 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు, పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్, రీకౌంటంగ్కు ఈ నెల 9 వరకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా 82 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలు 76శాతంతో రెండోస్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా 72శాతం, చిత్తూరు 71శాతం, వరంగల్ 70 శాతం, ప్రకాశం 67శాతం, హైదరాబాద్ 64శాతం, నల్గొండ 53 శాతం, ఉత్తీర్ణత సాధించాయి. మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు 49శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. ఇంటర్ ద్వితీయ సంతవత్సర ఫలితాలు విడదలయ్యాయి. విద్యార్థులు పునర్ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 7 చివరి తేది. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.





