Monday, 2 November 2026

ప్రాంతీయం నుంచి జాతీయం దాకా


ఢిల్లీ రాజకీయాల్లో తెరాస కీలకపాత్ర

థర్డ్‌ ఫ్రంట్‌ రూపకల్పనలో సూత్రధారిగా కేకే

హైదరాబాద్‌, మే 3 (జనంసాక్షి) :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుష్కరకాలం క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతోంది. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ ఎస్‌ గత బుధవారం జరిగిన ఎన్నికల్లో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తెలంగాణలో భారీగా జరిగిన క్రాస్‌ ఓటింగ్‌ తమకు అనుకూ లిస్తుందనే లెక్కల్లో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలకు పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ పది లోక్‌సభ, 70కి పైగా శాసనసభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అ యితే టీఆర్‌ఎస్‌ లెక్కలకు కొంచెం అటు ఇటుగా సీట్లు వచ్చే అవకా శాలున్నట్లు పరిశీలకు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు ఉత్తర తెలం గాణలో మంచి ఆదరణే ఉంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా పునర్ని ర్మించే అవకాశం తమకే ఇవ్వాలనే అంశాన్ని టీఆర్‌ఎస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ అధ్యక్షుడు చం ద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ వారి వల్ల తెలంగాణ రా ష్ట్రానికి ముప్పు పొంచి ఉందంటూ ప్రజలను హెచ్చరించి వారిని ఒక్కతాటిపైకి తీసుకురావడంలో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్ర శేఖర్‌రావు విజయం సాధించారు. ఆ ప్రభావం పోలింగ్‌ సంద ర్భంగా ప్రత్యక్షంగా కనిపించింది. తెలంగాణవాదం అంతగా లేని నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ ఈసారి ఓటర్లకు చేరువైంది. కరువు జిల్లా మహబూబ్‌నగర్‌లోనూ కీలకంగా మారింది. ఆ ఫలితం ఎన్నికలపై ప్రస్ఫుటంగా పడింది. ఈనేపథ్యంలో రెండంకెల పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకొని కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ ఎత్తు గడలు వేస్తుంది. ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే పేరుతో కేంద్ర పాలితప్రాంతంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్న నేపథ్యంలో దాన్ని తుత్తినియలు చేసేందుకు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావును రంగంలోకి దించారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా, అనేక రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా జాతీయ రాజకీయాల్లో తలపండిన కేకేను తృతీయ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించేలా దిశానిర్దేశం చేసింది టీఆర్‌ఎస్‌. ఈమేరకు ఢిల్లీ వెళ్లిన కేకే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తృతీయ కూటమి ఏర్పాటులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అయితే ఆయన కోల్‌కతాకు వెళ్లి తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీతో భేటీ అయినట్లుగా ఊహాగానాలు చెలరేగాయి. అయితే అది నిజం కాదని కేశవరావు చెప్పారు. తాను ఢిల్లీలోనే ఉన్నాని, థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం తాము చర్చిస్తున్న విషయం నిజమేనని తెలిపారు. ఈనెల 16న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో మరికొన్ని పార్టీలు కూడా థర్డ్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నిస్తున్నాయని ఎన్‌డీఏ, యూపీఏ యేతర ప్రత్యామ్నాయం ఏర్పాటులో భాగంగా వారితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని ఆయన పేర్కొన్నారు. టీఎంసీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పాటు లౌకికపార్టీలతో కలిసి ముందుకు సాగుతామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *