Monday, 2 November 2026

జనాన్ని మోసం చేసేందుకు భాజపా, టీడీపీల యత్నం

వైకాపా నకిలీ కాంగ్రెస్‌ పార్టీ : జైరామ్‌ రమేశ్‌
అనంతపురం, మే 3 (జనంసాక్షి) :
టీడీపీ, బీజేపీలు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, వైకాపా నకిలీ కాంగ్రెస్‌ పార్టీ అని కేంద్ర మంత్రి నేత జైరామ్‌ రమేశ్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీ నకిలీ కాంగ్రెస్‌ అని, ఆ పార్టీని ప్రజలు విశ్వసిం చరని విమర్శించారు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన జగన్‌ను సీమాంధ్ర ప్రజలు నమ్మరని అన్నారు. శనివారం అనంతపురంలో జైరాం విూడి యాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన నాయకులపై విమర్శలు గుప్పించారు. జగన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్‌, రాయపాటి సాంబశివరావు, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావూరి సాంబశివరావు వంటి వారిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి కోట్లు సంపాదించుకున్న నేతలు పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. పార్టీతో లబ్ధి పొంది, చివరకు వెన్నుపోటు పొడిచారన్నారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్లే కాంగ్రెస్‌ను విడిచి వెళ్లిపోయారన్నారు. మాజీ సీఎం కిరణ్‌ వల్లే కాంగ్రెస్‌తో పాటు సీమాంధ్రకు భారీ నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. మంత్రి కాలేని వ్యక్తిని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందని.. కానీ, ఆ వ్యక్తి మాత్రం పార్టీ హైకమాండ్‌ను ధిక్కరించారని మండిపడ్డారు.బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై జైరామ్‌ రమేశ్‌ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ వల్లే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మోడీ ఆరోపణలను ఖండించారు. ఎన్నికల సమయంలో ప్రజలను మోసపుచ్చేందుకు మోడీ రకరకాల హామీలుస్తుంటారని విమర్శించారు. ప్రజలను ఆకట్టుకొనేందుకు పథకాల పేరుతో గిమ్మిక్కులు చేస్తారన్నారు. మోడీ పునీతుడేం కాదని, ఆయనపై డజనుకు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. జైలు నుంచి వచ్చిన జగన్‌కు ఓటేస్తే ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలని జైరాం సూచించారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి ఎలా ఓటేయాలన్నారు. జైలుకు వెళ్లే జగన్‌కు ఓటు వేయొద్దని కోరారు. వైఎస్సార్‌సీపీ ఓ నకిలీ కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ వాది అని, తమ పార్టీ హయాంలో చేపట్టిన పథకాలను జగన్‌ తన తండ్రివని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పావలా వడ్డీ, ఇందిరమ్మ వంటి పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని తెలిపారు. మాటపై నిలబడని, విశ్వసనీయత లేని వ్యక్తి జగన్‌.. పూటకో మాట మారుస్తాడని మండిపడ్డారు. ఒకసారి రాష్ట్రాన్ని విభజించాలని చెప్పారని, ఆ తర్వాత సమైక్యాంధ్ర అన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు వైఎస్‌ ఆనాడే అంగీకరించిన విషయాన్ని మరిచిపోయావా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీని జనం విశ్వసించరని తెలిపారు.ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ-టీడీపీ కూటమి మరోసారి ముందుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. వారి హయాంలో గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మతతత్వ పార్టీతో జట్టు కట్టారని, ఇద్దరూ కలిసి ప్రజలను మరోమారు మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఏకవ్యక్తి పార్టీగా మారిందని, టీడీపీ దానికి తోక పార్టీగా మారిందని విమర్శించారు. రాష్ట్ర విభజన చేయాలని లేఖ ఇచ్చిన చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం అర్థరహితమన్నారు. రాష్టాన్న్రి విడగొట్టాలని స్పష్టంగా చెప్పిన బాబు.. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తమ వల్లే విభజన జరిగిందన్న టీడీపీ అధినేత.. సీమాంధ్రలో ఆ మాట చెప్పే ధైర్యముందా? అని నిలదీశారు. టీడీపీ-బీజేపీ అధికారంలోకి వస్తే వినాశనమేనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *