Tuesday, 3 November 2026

తెలంగాణలో అధికారం మాదే : జానా


హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ప్రజా దరణ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఎవరి ద్వారా వచ్చిందో ప్రజలు గ్రహించారని, కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో తాము అధిక స్థానాలు గెలుచుకోవడమే కా కుండా తొలి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. తాము ఎక్కువ స్థానాలు గెలుస్తామని టీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచా రం చేస్తోందని అన్నారు. మెజారిటీ స్థానాలు గెలుచుకునేంత బలం ఆ పార్టీకి లేదని చెప్పారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ ని ర్మాణం, పునాది పటిష్టంగా ఉన్నాయని అన్నారు. మాకు 45 నుంచి 50 స్థానాలు వస్తాయని, మిత్రపక్షాలతో కలిసి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే పది స్థానాలు కైవసం చేసుకుంటామని అన్నారు. శా సనసభ్యులు అభిప్రాయాల మేరకే సీఎం అభ్యర్థి నిర్ణయం ఉం టుందన్నారు. సిఎం పదవి కోసం మాలో ఎవరూ పైరవీలు చేయడం లేదన్నారు. లగడపాటి మాటలు, సర్వేల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని, ఇది ఎంతో దూరం లేదని, వారం రోజుల్లో స్పష్టమవుతుందని అ న్నారు. సమావేశంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి, కసిరెడ్డి నారా యణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని కేసీఆరే తొలి సీఎం అవుతారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ ఎన్నికలకు ముందే ఆర్‌.కృష్ణయ్యను
సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌ విషయానికొస్తే.. ఈ పార్టీకి చెందిన నేతలు తమది జాతీయ పార్టీ అని, అధిష్టానం ఆదేశం మేరకే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రేసులో సీనియర్‌ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్‌, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, వి.హనుమంతరావు తదితరులు ఉండగా, మహళా నేతల్లో గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ప్రచార సభలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణకు మహిళను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడంతో పురుష నేతలు ఖంగు తిన్నారు. కాగా, మహిళల్లో మాత్రం సీఎం పదవితో ఆశలు చిగురించాయి. ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ మహిళల ఓట్లకోసం ఈ ప్రకటన చేసారా అన్నది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ముగిశాయి. స్థానాల గెలుపుపై లెక్కలు వేస్తున్నారు. తెలంగాణలో తమ పార్టీకి 45 నుంచి 50 స్థానాలు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఎంఐఎం, సీపీఐల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇలా ఉండగా, సీఎం పదవి కోసం ఇప్పటి నుంచే నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి జానారెడ్డి కావాలని, అతను అన్ని విధాలా అర్హుడని మాజీమంత్రి దామోదర్‌రెడ్డి పేర్కొంటుంటే, తాను సీఎం పదవి కోసం పైరవి చేయడం లేదని, అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారే సీఎం అవుతారని జానారెడ్డి అన్నారు. లోలోపల జానారెడ్డికి సీఎం కావాలన్న బలమైన కోరిక ఉన్నప్పటికీ పైకి మాత్రం సిఎం పదవిపై ఆశ లేదన్నారు. పదవి కోసం మాలో ఎవరూ పైరవీలో చేయడం లేదని జానారెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *