Monday, 2 November 2026

ఆ ఎఫ్‌ఐఆర్‌లో భగత్‌సింగ్‌ పేరులేదు


83 ఏళ్ల తర్వాత వెలుగు చూసిన నిప్పులాంటి నిజం
లాహోర్‌, మే 4 (జనంసాక్షి) :
బ్రిటిష్‌ అధికారి ఎస్‌ఎస్‌పీ జాన్‌ సౌండర్స్‌ హత్య కేసులో ఉరిశిక్ష విధించబడిన ప్రఖ్యాత స్వాతంత్య్ర సమర యోధుడు, యువతకు దిక్సూచీ భగత్‌సింగ్‌ అసలు సౌండర్స్‌ హత్య కేసులో నిందితుడే కాదు. ఇది నిజ మే సౌండర్స్‌ హత్యానంతరం లాహోర్‌ పోలీసులు నమోదు చేసిన ఫస్ట్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్టు (ఎఫ్‌ఐ ఆర్‌)లో ఆయన పేరు లేదు. నిప్పులాంటి ఈ నిజం ఆయనను ఉరి తీసిన ఎనిమిది దశాబ్దాల అనం తరం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. భగత్‌సింగ్‌ మెమోరియల్‌ ఫండేషన్‌ చైర్మన్‌ ఇం తియాజ్‌ రషీద్‌ ఖురేషి సౌండర్స్‌ హత్య కేసులో దాఖ లైన ఎఫ్‌ఐఆర్‌ కాపీని కోర్టు ఆదేశాల మేరకు సం పాదించాడు. అందులో అసలు భగత్‌సింగ్‌ పేరే లేదని ఆయన వెల్లడించారు. భగత్‌సింగ్‌,
రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను సౌండర్స్‌ హత్య కేసులో 1931 జూన్‌ 23న లాహోర్‌లోని షద్మాన్‌ చౌక్‌లో ఉరితీసిన విషయం తెలిసిందే. సౌండర్స్‌ హత్యపై లాహోర్‌లోని అనార్కలీ పోలీస్‌ స్టేషన్‌లో 1928 డిసెంబర్‌ 17న సాయంత్రం 4.30 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అందులో ఇందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో సౌండర్స్‌ను హత్య చేసినట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ కేసులో అనార్కలీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రత్యక్ష సాక్షి హత్యకు పాల్పడిన వ్యక్తి ఐదు అడుగుల ఐదు అంగులాల పొడవు ఉంటాడని, హిందూ మతస్తుడిలా ఉన్నాడని సన్నగా దృఢమైన శరీరాకృతి కలిగి ఉన్నాడని అతడు కుర్తాపైజమా ధరించి ఉన్నాడని నల్లటి టోపీ పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే సౌండర్స్‌ను హత్య చేసిన సమయంలో ఆ ప్రాంతంలో కనీసం 450 మంది ఉన్నట్టు గుర్తించారు. భగత్‌సింగ్‌ తరపు లాయర్‌ ఆ సాక్షులను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా న్యాయమూర్తులు భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించారని ఖురేషి తెలిపారు. సౌండర్స్‌ హత్య కేసులో భగత్‌సింగ్‌ నిర్దోషి అని నిరూపించడమే తన లక్ష్యమని అందుకోసమే లాహోర్‌ హైకోర్టులో ప్రత్యేకంగా పిటిషన్‌ దాఖలు చేశానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *