
ప్రచారం ముగిసింది
ఒపీనియన్ పోల్స్, సర్వేలపై నిషేధం : భన్వర్‌లాల్
హైదరాబాద్, మే 5 (జనంసాక్షి) :సీమాంధ్ర ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. దీంతో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఇసి పూర్తిస్థాయి ఏ ర్పాట్లు చేసింది. బుధవారం 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ జరుగుతందని విూడియా సమావేశంలో భన్వర్ లాల్ వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్, సర్వేలు నిషేధమన్నారు. విూడియాలో ప్రచారానికి అనుమతి లేదన్నారు. మద్యం దుకాణాలు, బార్లు గురువారం వరకు మూత వేయాలన్నారు. ఓటు కోసం అన్ని సంస్థలకు సెలవరు ప్రకటించారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని.. స్లిప్పులు లేకున్నా ఓటెయ్యవచ్చని తెలిపారు. పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకునేందుకు 9246280027 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేస్తే వివరాలు లభ్యమవుతాయని తెలిపారు. ఎన్నికలు పూర్తయే వరకు ఎగ్జిట్ పోల్స్, సర్వేలపై నిషేధం ఉంటుందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీమాంధ్రవ్యాప్తంగా 7న అన్ని సంస్థలు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని ఆదేశించారు. ఓటర్ స్లిప్ లేకున్నా సరైన గుర్తింపు కార్డ్ ఉంటే చాలు ఓటు వేయొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. స్థానికేతరులు నియోజకవర్గాలు వదిలి వెళ్లాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కంపెనీలు, వ్యాపారసంస్థలు పోలింగ్ రోజును భత్యంతో కూడిన సెలవుదినాన్ని ప్రకటించాలని విజ్‌క్షప్తి చేశారు. రాష్ట్రంలోని 2వ దశ పోలింగ్‌లో అరకు, పాడేరు స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెద్దకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్లలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. మిగతా 165 అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని భన్వర్‌లాల్ తెలిపారు. ఓటరు లిస్ట్‌లో పేరుంటే 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకటి చూపించి ఓటు వేయొచ్చని తెలిపారు. ఫిర్యాదులేమనై ఉంటే 1950కి ఫోన్ చేయాలని ఎస్‌ఎంఎస్ సర్వీస్ ద్వారా పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్నని ఆయన తెలిపారు. 25 ఎంపీ స్థానాలకు 333 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,241 మంది బరిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు మొత్తం 40,708 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన విూడియాకు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం ఓటర్లు 3,67,62,975 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని భన్వర్‌లాల్ తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ తెలిపారు.
సీమాంధ్రలో సర్వం సిద్ధం




