Tuesday, 3 November 2026

ముతావలిల సస్పెన్షన్‌ అక్రమమం


హైదరాబాద్‌, మే 5 (జనంసాక్షి) :
దర్గాల ముతావలీల సస్పెన్షన్‌ అక్రకమని సాజ్జా దాన్‌, ముతావలీయన్‌ వా ఖిదిమాత్‌ గురారన్‌ ఇ వక్ఫ్‌, అంజుమన్‌ ఇ ఖ్వా డ్రియా తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. దర్గాల సంరక్షకులను స స్పెండ్‌ చేస్తూ ఏపీ వక్ప్‌ Ûబోర్డు ప్రత్యేకాధికారి షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ తీసు కున్న నిర్ణయాన్ని వారు ఆక్షేపించారు. రాజకీయ దురుద్దేశంతోనే మహ్మద్‌ ఇక్బాల్‌ ముతావలీలను స స్పెండ్‌ చేశారని వారు ఆరోపించారు. వక్ఫ్‌బోర్డులోని బ్రోకర్లు, భూ కబ్జా దారులు, బ్లాక్‌ మెయిలర్ల ప్రమేయం, ప్రోత్సా హంతోనే ఈ నిర్ణయం
తీసుకున్నారంటూ వారు మండిపడ్డారు. వక్ఫ్‌బోర్డు అధికారి కొన్ని దర్గాల ముతావలీలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాడని వారు ఆరోపించారు. వక్ఫ్‌బోర్డు పరిధిలోని ఇతర సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ముస్లిం యునైటెడ్‌ ఫోరం సభ్యుడు మౌలానా సయీద్‌ ఖాద్రి మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి వివక్ష ప్రదర్శిస్తున్నాడని తెలిపారు. అక్రమాల పేరుతో తెలంగాణలోని ముతావలీలను, సజ్జదా నషీన్లపై చర్యలు తీసుకున్న వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి చర్యల్లోనూ వివక్ష ప్రదర్శించాడనే వార్తల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలోని ముతావలీలు, సజ్జాదా నషీన్లపై కూడా చర్యలు తీసుకున్నారని ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *