
న్యూఢిల్లీ, మే 25 (జనంసాక్షి) :
బొగ్గు బ్లాకుల కేటా యింపు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న కేంద్ర బొగ్గు శాఖ మాజీ మంత్రి దా సరి నారాయణరావు, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్‌పై మనీలాండ రింగ్ కేసు నమోదైంది. ఈమేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు పెట్టింది. బొగ్లు క్షేత్రాల అక్రమ కేటాయింపుల ద్వారా ఆయా సంస్థల నుంచి ముడుపుల రూపేణ వచ్చిన డబ్బును అక్రమ మార్గాల ద్వారా మళ్లింపు (పీఎంఎల్‌ఏ) చట్టం కింద సీబీఐ ఫిర్యాదును ఆధారం చేసుకొని కేసు నమోదు చేఇసనట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. దాసరి నారాయణరావు, నవీన్ జిందాల్‌తో పాటు ప్రభుత్వ స్క్రీనింగ్ కమిటీ అధికారులపై ఈడీ కేసులు నమోదు చేసింది. గగన్‌స్పాంజ్ ఐరన్, జిందాల్ స్టీల్ అండ్ ఐరన్, జిందాల్ రియాల్టీ, న్యూఢిల్లీ ఎగ్జిమ్, సౌభాగ్య మీడియా తదితర సంస్థలపై ఈడీ కేసులు నమోదు చేసింది. దాసరి, నవీన్ ల మధ్య జరిగిన లావాదేవీలను తనిఖీ చేసిన తర్వాత అక్రమంగా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. దాసరి నారాయణరావు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2008లో జార్ఖండ్‌లోని బొగ్గు క్షేత్రాలను జిందాల్ కంపెనీకి కేటాయించారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ ఇదివరకే కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది.
దాసరి, నవీన్ జిందాల్‌పై మనీ లాండరింగ్ కేసు




