Monday, 2 November 2026

అభివృద్ధి అంటే అవినీతితో ఆస్తుల సంపాదనే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు మండిపాటు
హైదరాబాద్( జ‌నంసాక్షి): ఒక పార్టీ అధికార దాహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మండి పడ్డారు. బుధవారం ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విషతుల్య మద్యం పారిస్తోందని, దాంతో పలువురు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తాము యువతలోని కీలక శక్తిపై ఫోకస్ పెట్టామని, దాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా వినియోగించుకోవడం ఎలా? అని యోచిస్తున్నామని చెప్పారు.  ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని మరో ట్వీట్ చేశారు. ఓటర్లు తమ ఉజ్వల భవిష్యత్ కోసం ఓటేయాలని, మంచికి, అభివృద్ధికి, స్వర్ణాంధ్ర కోసం ఓటేయాలన్నారు..బిజెపి, టిడిపి కూటమికి ఓటేయాలని చంద్రబాబు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో అవినీతితో ఆస్తులను ఎలా పెంచుకోవాలనుకోవడమేనని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి బయట పడేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేస్తున్నదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *