Tuesday, 3 November 2026

సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్లాల్

హైదరాబాద్ : ఓడిపోతున్నామన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో కూడా వారికి తెలియట్లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అమర్యాదగా ప్రవర్తించారు. తన నోటి దురుసును ప్రదర్శించారు. దీంతో భన్వర్లాల్ నొచ్చుకుని, రమేష్ను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఇలాగే ఉంటారా అంటూ తీవ్రస్వరంతో ప్రశ్నించారు.పక్కగ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకునే విషయంలో హైకోర్టు స్టే ఇస్తే మీరేం చేస్తున్నారంటూ భన్వర్‌లాల్‌ను సీఎం రమేష్‌ ప్రశ్నించారు. అయితే, హైకోర్టు తీర్పు తన పరిధిలోకి రాదని ఆయనకు భన్వర్‌లాల్‌ చెప్పారు. అంతేకాక, మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదని, పద్దతి మార్చుకోవాలంటూ సీఎం రమేష్‌ను భన్వర్లాల్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *