Monday, 2 November 2026

రాయపాటికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : గుంటూరు జిల్లా నర్సరావు పేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నర్సరావు పేట మండలం బసికాపురం గ్రామ పోలింగ్ కేంద్రం వద్దకు పోలింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన రాయపాటి సాంబశివరావు వాహనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని రాయపాటిని సురక్షితంగా తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *