Tuesday, 3 November 2026

ఇష్రాత్‌ జహాన్‌ ‘ఎన్‌కౌంటర్‌’లో అమిత్‌షాకు క్లీన్‌చీట్‌ : సీబీఐ


న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) :
ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్‌ షాకు ఊరట లభించింది. ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో షాకు కేంద్ర దర్యాప్తు బృం దం క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు ద ర్యాప్తు సంస్థ బుధవారం సీబీఐ ప్రత్యే క కోర్టులో తన నివేదికను సమర్పిం చింది. షా పాత్రకు
సంబంధించి ఆయనను విచారించదగిన ఆధారాలు ఏవీ లేవని పేర్కొంది. ఇష్రాత్‌ జహన్‌ సహా మరో ముగ్గురు ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే చార్జిషీట్లు సమర్పించిన దర్యాప్తు సంస్థ రాజకీయ నాయకుల పేర్లు చేర్చలేదు. కానీ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులపై హత్యతో పలు అభియోగాలు మోపింది. 2004 జూన్‌ 15న జరిగిన ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో ఇష్రత్‌తో పాటు జావేద్‌ షేక్‌, జీషన్‌ జోహర్‌, అంజాద్‌ అలీ రాణా మృతి చెందారు. ఈ కేసులో ఐపీఎస్‌ అధికారి జీఎల్‌ సింఘాల్‌, రిటైర్డ్‌ డీఎస్పీ పార్మార్‌ సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో రాష్ట్ర పోలీసులు, నిఘా వర్గాల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. పోలీసులే ఇష్రాత్‌ సహా నలుగురిని అపహరించి, రెండ్రోజుల తర్వాత కాల్చిచంపారని ఆరోపణలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *