
బాధ్యతలు నాకు అప్పగించండి
నీకు విలాసాల బంగ్లాలా?
ఆమెకు సాధారణ జీవితమా?
ఇదే న్యాయం : రషీద్ అల్వీ
న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) :బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తన తల్లికి సౌకర్య వంతమైన జీవితాన్ని అందించేందుకు అవకాశమున్న అందుకు ఎంతమాత్రం చొరవ చూప కపోవడంపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీ తల్లిని సంరక్షించే బా ధ్యత తనకు ఇవ్వాలంటూ’ ఆయన మోడీకి లేఖరాశారు. మోడీ మాతృమూర్తి ఒక చిన్న గదిలో జీవించడం, ఆటోరిక్షాలో ప్రయాణించడంపై రషీద్ నిరసన వ్యక్తం చేశారు. ఆమెకు సౌకర్యాలు కల్పించే అధికారం, సంపద ఉన్నప్పటికీ దానిని విస్మరించినందున ఆమె బాగో గులు చూసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని లేఖలో
పేర్కొన్నాడు. ‘మీ తల్లిగారికి ఎందుకు సౌకర్యవంతమైన జీవితాన్ని మీరు ఎందుకు సమకూర్చలేదో నాకైతే అర్థం కావడం లేదంటూ’ లేఖలో ప్రస్తావించాడు. ‘మీ తల్లిగారు నాకు కూడా తల్లిలాంటిది. ఆమె అంటే నాకు ఎలేని గౌరవం. మీలాగా నాకు అపరిమితమైన వనరులు ఉండకపోవచ్చు కానీ, నా శక్తి కొద్దీ ఆమెకు అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తాను, అందుకు అనుమతి ఇవ్వాలని వేడుంకుటున్నాను’ అని రషీద్ అర్థించాడు. ఆమె అత్యంత కిష్టకాలంలో మోడీని ఒంటిచేత్తో పెంచిందని ప్రచారం చేస్తున్న మోడీ ఇప్పుడు తన బాధ్యతను విస్మరించాడని ఆయన ఆక్షేపించాడు. గుజరాత్ ముఖ్యమంత్రి తల్లి ఒక చిన్న గదిలో నివసిస్తున్నట్లు తెలుసుకొని తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నాడు. ఇటీవల ఓటు వేయడానికి ఆమె ఆటోరిక్షాలో వెళ్లడాన్ని చూసి తీవ్ర నిస్పృహ చెందానని తెలిపారు. భారతీయ సంస్కృతిలో కుమారుడు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగితే ఆ విజయ ఫలాలను అనుభవించాల్సింది ముందుగా తల్లిదండ్రులేనని పేర్కొన్నాడు. మోడీ తన నామినేషన్ దాఖలు సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల విలువ రూ.1.25 కోట్లకు పైచిలుకుగా చూపించారు. అంత సంపద ఉండికూడా తల్లికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచ చేసిందన్నారు. తరచూ ప్రైవేట్ జెట్ విమానాల్లో, లగ్జరీ కార్లలో ప్రయాణించే మోడీ, డిజైనర్ చేతి గడియారాలు, మౌంట్ బ్లాంక్ ఫౌంటేన్ పెన్నులపై ప్రేమ చూపే మోడీ తల్లిని విస్మరించడం సబబు కాదు అంటూ లేఖలో పేర్కొన్నాడు.
నన్ను బలిపశువు చేశారు
మోడీజీ.. మీ అమ్మగారి




