Tuesday, 3 November 2026

కులంపై కాదు.. రాజనీతిపైనే మాపోరాటం : రాహుల్‌


అమేథి, మే 7 (జనంసాక్షి) :
మోడీ కులంపై తాము పోరాడటం లేదని, ఆయన అనుసరిస్తున్న రాజనీతిపై మాత్రమే పో రాడుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తన సోదరి ప్రి యాంక గాంధీ చేసిన నీచ రాజకీయాలను తప్పుబట్టిన నరేంద్రమోడీ అది తన కులంపై దాడిగా అభివర్ణించారు. నరేంద్రమోడీ కులం గురించిన ప్రస్తావన ప్రియాంక చేయలేదని, మోడీ రాజకీయ చర్యలు నీచమైనవని రా హుల్‌ వ్యాఖ్యానిం చారు. ‘కులం కాదు.. కర్మ నీచమైనది అవుతుం ది. ఆలోచనా విధానం నీ చమైనది అవుతుంది. విద్వేష సిద్ధాంతం నీచ మైనది అవుతుంది’ అంటూ ఆయన మోడీ తీరును కడిగిపారే శాడు. బుధవారం అమేథిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ప్రియాం కగాంధీ తన కులాన్ని అవమానించారని, నిమ్మ కులంలో పుట్టడం నేరమా? అంటూ మోడీ ఎదరుదాడికి దిగగా ఆ వ్యాఖ్యలపై రాహుల్‌ వివరణ ఇస్తూ మోడీ చర్యలను కడిగి పారేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *