హైదరాబాద్: పోలింగ్ ఘట్టం ముగియడంతో నేతలంతా విశ్రాంతి బాట పట్టారు. టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన వెళ్తుంటే.. వైసీపీ అధినేత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు ఆయన కుటుంబంతో కలిసి అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. జగన్ డెహ్రాడూన్ వెళ్లేందుకు న్యాయస్థానం కూడా అనుమతినిచ్చింది.




